'చాహల్‌ వల్లే నీకు కెరీర్‌'.. ఆర్జే మహ్‌వశ్‌ రిప్లై చూశారా? | RJ Mahvash Responds On Cricketer Yuzvendra Chahal Gives Her Career | Sakshi
Sakshi News home page

RJ Mahvash: 'చాహల్‌ వల్లే నీకు కెరీర్‌'.. ఆర్జే మహ్‌వశ్‌ రిప్లై చూశారా?

Jun 20 2025 7:01 PM | Updated on Jun 20 2025 7:31 PM

RJ Mahvash Responds On Cricketer Yuzvendra Chahal Gives Her Career

బాలీవుడ్‌లో ప్రముఖ ఆర్జే మహ్‌వశ్‌ (RJ Mahvash) గత కొంతకాలంగా తెగ వైరలైంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె పేరు మార్మోగిపోయింది. దానికి కారణం దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్. ఆ మ్యాచ్ తర్వాత అప్పటి వరకు ఎవరికీ పెద్దగా తెలియని ఆమెపేరు ఒక్కసారిగా నెట్టింట హల్‌చల్‌ చేసింది. టీమిండియా క్రికెటర్‌ యుజ్వేంద్ర చాహల్‌తో కలిసి స్టేడియంలో కనిపించడంతో ఆర్జే పేరు వైరలైపోయింది. ఆ తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ టీమ్‌కు మద్దతుగా మహ్‌వశ్‌ మ్యాచుల్లో సందడి చేసింది. దీంతో వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ సామాజిక మాధ్యమాల్లో కోడై కూసింది. తనపై వస్తున్న రూమర్స్‌పై కూడా ఆమె స్పందించింది.

తాజాగా ఆర్జే మహ్‌వశ్‌ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. అందులో నెటిజన్స్‌ చేసిన కామెంట్స్‌ను ప్రస్తావించింది. వాటికి వివరణ ఇస్తూ ఓ వీడియోను పంచుకుంది. 'యూజీ భాయ్‌నే ఇస్కా కెరీర్‌ బనా దియా'(యుజ్వేంద్ర చాహల్‌ ఆమె కెరీర్‌ను నిలబెట్టాడు) అంటూ ఓ నెటిజన్‌ చేసిన కామెంట్స్‌కు తనదైన స్టైల్లో సమాధానమిచ్చింది.

నేను 2019 నుంచి ఇండస్ట్రీలో ఉన్నా.. 2023లో సొంతగా నిర్మాణ సంస్థను కూడా స్థాపించానని ఆర్జే మహ్‌వశ్‌ తెలిపింది. నవాజుద్దీన్ సిద్దిఖీ హీరోగా సెక్షన్‌-108 మూవీని నిర్మించినట్లు పేర్కొంది. అంతేకాకుండా మరో సినిమాను నిర్మించేందుకు రెడీ అయినట్లు కూడా వెల్లడించింది. ఆ తర్వాత మీకు క్రికెట్‌ గురించి ఏమైనా తెలుసా? అంటూ ఓ నెటిజన్ ‍కామెంట్‌ చేశాడు. మీరు పుట్టకుముందు నుంచే తాను క్రికెట్‌ మ్యాచ్‌లు చూస్తున్నానని కుల్‌దీప్‌ యాదవ్, ధోని, బ్రెట్ లీ, సురేశ్ రైనా, క్రిస్‌గేల్‌, అక్తర్‌, జాక్వస్‌ కలిస్‌తో దిగిన ఫోటోలను కూడా వీడియో చూపించింది. మీరు ఏదైనా మాట్లాడేముందు తన గురించి తెలుసుకోవాలని హితవు పలికింది. అంతేకానీ ఎవరో పంపిన వాటిని ఫార్వార్డ్ చేయకండి అంటూ మహ్‌వశ్‌ అదిరిపోయే రిప్లై ఇచ్చింది. ఈ లెక్కన ఆర్జే మహ్‌వశ్.. యుజ్వేంద్ర చాహల్‌ పరిచయానికి ముందే క్రికెట్‌తో అనుబంధం ఉందన్నమాట.
 

 

Advertisement
 
Advertisement
Advertisement