Rashmika Mandanna: హీరోతో లిప్‌లాక్‌ సీన్‌.. కొందరు ఫోన్‌ చేసి దారుణంగా విమర్శించారు

Rashmika Mandanna Recalls About Trolls For Liplock Scene With Vijay Devarakonda In Dear - Sakshi

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కిరిక్‌ పార్టీ అనే కన్నడ చిత్రంలో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాత టాలీవుడ్‌, తమిళ్‌లో వరుస అవకాశాలు అందుకుంది. ఛలో, గీతా గోవిందంతో తెలుగులో గుర్తింపు పొందిన ఆమె పుష్పతో రాత్రిరాత్రే స్టార్‌డమ్‌ తెచ్చుకుంది. ప్రస్తుతం ఏకకాలంలో తెలుగు, హిందీ, తమిళంలో వరుస ప్రాజెక్ట్‌ చేస్తూ ఫుల్‌ బిజీగా మారింది. ఆమె నటించిన లేటెస్ట్‌ బాలీవుడ్‌ చిత్రం గుడ్‌బై విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా విజయ్‌ దేవరకొండ సరసన ఆమె నటించిన డియర్‌ కామ్రేడ్‌ మూవీ సమయంలో తను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంది.

చదవండి: ప్రభాస్‌కు ఏమైంది? ఫ్యాన్స్‌ ఆందోళన

కాగా తన క్యూట్‌ క్యూట్‌ స్మైల్‌, ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు ఆకట్టుకుంటున్న రష్మికకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎంత ఉందో.. అలాగే విమర్శించే వారు సైతం ఉన్నారు. అయితే తాజాగా తనపై వచ్చే విమర్శలపై స్పందించింది రష్మిక. డియర్‌ కామ్రేడ్‌ సమయంలో విజయ్‌ లిప్‌లాక్‌ సీన్‌పై విపరీతమైన ట్రోల్స్‌ వచ్చాయి. అదే విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకుంటూ భావోద్వేడానికి గురైంది. ‘ఆ రోజులను నేను ఎప్పటికి మర్చిపోలేను. చెప్పాలంటే అవి నాకు కఠినమైన రోజులు. డియర్‌ కామ్రేడ్‌ సినిమాలోని లిప్‌లాక్‌ సీన్‌పై వచ్చిన ట్రోల్స్‌ ఎలా అధిగమించానో, ఆ బాధ నుంచి ఎలా బయటపడ్డానో ఇప్పటికి నాకర్థం కావడం లేదు. నేను చాలా సెన్సిటీవ్‌ పర్సన్‌ని, విమర్శలని అసలు తట్టుకోలేకపోయేదాన్ని’ అని చెప్పుకొచ్చింది.

చదవండి: ‘ఓం రౌత్‌కు రామాయణం తెలియదా?’ బీజేపీ మహిళా నేత విమర్శలు

అలాగే ‘ఆ సమయంలో కొందరు నాకు ఫోన్‌ చేసి అంతా సర్దుకుంటుంది.. ఏం కాదు అని ధైర్యం చెప్పేవారు. మరి కొందరు మాత్రం నన్ను దారుణంగా విమర్శించారు. అవి నన్ను తీవ్రంగా బాధించాయి. ఎంతో ఒత్తిడికి గురయ్యా. రాత్రి పడుకుంటే పీడకలలు వచ్చేవి. నేను ఎవరినో వేడుకుంటున్నట్టుగా కలలు వచ్చేవి. అందరు నన్ను దూరంగా పెడుతున్నట్టు, నన్ను అసహ్యించుకుంటున్నట్లు వచ్చేవి. దీంతో మధ్య రాత్రిళ్లు ఉలిక్కి పడి లేచి ఏడిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. అవి తలుచుకుంటే ఇప్పటికీ నాకు భయమేస్తుంది’ అంటూ రష్మిక ఎమోషనల్‌ అయ్యింది. కాగా ప్రస్తుతం రష్మిక తెలుగులో పుష్ప మూవీతో పాటు హిందీలో యానిమల్‌, తమిళంలో వారీసు చిత్రాలతో బిజీగా ఉంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top