బన్నీతో డ్యాన్స్‌ అం‍టే మామూలుగా ఉండదుగా..

Rashmika Mandanna Begins Rehearsals For Allu Arjuns Pushpa - Sakshi

అల్లు అర్జున్‌ డ్యాన్స్‌ అదుర్స్‌ అని అందరికీ తెలిసిందే. రష్మికా మందన్నా కూడా బాగా డ్యాన్స్‌ చేయగలరు. అయినప్పటికీ డ్యాన్స్‌ ఇరగదీసే హీరోకి దీటుగా చేయాలంటే కొంచెం రిహార్సల్స్‌ అవసరం అనుకున్నారేమో! ప్రస్తుతం ఈ బ్యూటీ ఆ పని మీదే ఉన్నారు. అల్లు అర్జున్‌తో సై అంటే సై అని డ్యాన్స్‌ చేయడానికి ప్రాక్టీస్‌ చేస్తున్నారు.

సుకుమార్‌ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న ‘పుష్ప’లో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఓ పాట చిత్రీకరించనున్నారు. ఈ పాట కోసమే రష్మిక డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఈ సినిమా తొలి భాగం డిసెంబరులో రిలీజ్‌ కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top