నాకు కాబోయేవాడికి ఆధ్యాత్మిక చింతన ఉండాలి: రాశి ఖన్నా

Rashi Khanna Opens Up About Her Marriage - Sakshi

Rashi Khanna About Her Marriage: టాలీవుడ్‌ హీరోహీరోయిన్లు ఒక్కొక్కరుగా పెళ్లి బాట పడుతున్నారు. ఇప్పటికే హీరో రానా, నిఖిల్‌.. హీరోయిన్లు కాజల్‌, నిహారికలు పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇక ఇటీవల మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా కూడా నిశ్చితార్థం చేసుకుని బ్రేక్‌ చేసుకుంది. ఇదిలా ఉండగా రాశి ఖన్నా కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు కనిపిస్తోంది.  ప్రస్తుతం రాశి ఖన్నా టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పెళ్లిపై స్పందించింది.

చదవండి: అలా ఏడిస్తే హౌజ్‌ నుంచి ముందుగా వచ్చేది నువ్వే: కౌశల్‌

త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది. ఈ సందర్భంగా కాబోయేవాడు ఎలా ఉండాలనే ప్రశ్న ఎదురవగా ఈ భామ ఇలా చెప్పుకొచ్చింది. ‘నాకు కాబోయేవాడు పెద్దగా అందంగా లేకపోయినా పర్వాలేదు. కానీ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి. నా లాగే దేవుడిపై నమ్మకంతో పాటు భక్తిభావం ఉండాలి. అలాంటి లక్షణాలు ఉన్నావాడు నాకు భర్త రావాలని కోరుకుంటున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ప్రస్తుత కాలంలో అలాంటి వాడు దొరకడం కష్టమే అయినప్ప్పటికి వేతికి పట్టుకుని మరీ పెళ్లి చేసుకుంటానంటూ నవ్వుతూ చమత్కిరించింది. 

చదవండి: మాలీవుడ్‌ స్టార్‌ హీరోలలో అల్లు అర్జున్‌ ఎవరో తెలుసా?

కాగా రాశి ఖన్నా చేతిలో అరడజన్‌కు పైగా సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే తమిళంలో ‘అరణ్‌మణై 3’, విజయ్‌ సేతుపతి ‘తుగ్లక్‌ దర్బార్‌’సినిమాల షూటింగ్స్‌ను పూర్తి చేసుకుంది. ఆ తర్వాత కార్తీ ‘సర్దార్‌’, ధనుష్‌ హీరోగా మిత్రన్‌ జవహర్‌ దర్శకత్వంలో తెరకెక్కే ఓ సినిమాలో నటించే చాన్స్‌ కొట్టెసినట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి.   ఇలా తమిళంలో ఈ భామ తన సత్తా చాటుతోంది. ఇక తెలుగులో నాగచైతన్యతో ‘థ్యాంక్యూ’, గోపీచంద్‌ పక్కా కమర్షియల్‌ చిత్రాలు చేస్తోంది. హిందీలో షాహిద్‌ కపూర్‌ ‘సన్నీ’వర్కింగ్‌ టైటిల్‌, అజయ్‌ దేవగణ్‌తో ‘రుద్ర’ అనే వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌లతో ప్రస్తుతం ఆమె బిజీగా ఉంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top