నాగ వెర్సస్‌ రానా  | Sakshi
Sakshi News home page

నాగ వెర్సస్‌ రానా 

Published Thu, Feb 16 2023 2:24 AM

Rana Naidu on Netflix from March 10th - Sakshi

బాబాయ్‌ వెంకటేశ్‌, అబ్బాయ్‌ రానా తండ్రీకొడుకులుగా నటించిన వెబ్‌ సిరీస్‌ ‘రానా నాయుడు’. నాగ పాత్రలో వెంకటేశ్, రానా నాయుడుగా రానా నటించారు. అమెరికన్‌ సిరీస్‌ ‘రే డోనోవన్‌’కు ఇండియన్‌ అడాప్షన్‌గా రూపొందిన ఈ సిరీస్‌ మార్చి 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా బుధవారం ముంబైలో ‘రానా నాయుడు’ ట్రైలర్‌ను విడుదల చేశారు. సుందర్‌ ఆరోన్, కరణ్‌ అన్షుమాన్‌ నిర్మించారు. కరణ్‌ అన్షుమాన్, సుపర్ణ్‌ ఎస్‌. వర్మ దర్శకత్వం వహించారు.

‘‘రానాకి అతని తండ్రి నాగతో పెద్ద సమస్య ఉంటుంది. ఈ తండ్రీకొడుకుల మధ్య వచ్చే సమస్య ప్రధానాంశంగా ఈ సిరీస్‌ సాగుతుంది’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. ‘‘రానా నాయుడు పాత్ర సవాలుగా అనిపించింది’’ అన్నారు రానా. వెంకటేశ్, సుర్వీన్‌ చావ్లా, సుశాంత్‌ సింగ్, అభిషేక్‌ బెనర్జీ, గౌరవ్‌ చోప్రా, ప్రియా బెనర్జీ, ఆశిష్‌ విద్యార్థి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement