Ram Charan: అన్నా నిన్ను చూసేందుకు వచ్చా.. చెర్రీ అభిమాని ఎమోషనల్..!

Ram Charan Little Fan Emotional After Seing in Hyderabad - Sakshi

మెగా హీరో రామ్‌చరణ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇటీవలే ఆస్పత్రిలో ఓ చిట్టి అభిమాని కోరిక తీర్చిన చెర్రీ మరోసారి తన ఉదారత ప్రదర్శించారు. ఇటీవల హైదరాబాద్‌లో అభిమానులతో మీట్ నిర్వహించారు.  అయితే సెక్యూరిటీ కారణాలతో కొంతమందిని అనుమతించపోవడం సహజం. కానీ అభిమాన హీరోతో ఫోటో దిగాలని ఎవరికీ ఉండదు చెప్పండి. అలాగే చెర్రీ ఫ్యాన్స్ మీట్ జరుగుతుందని తెలుసుకున్న చిట్టి అభిమాని వేదిక వద్దకు చేరుకున్నాడు. 

 ఫ్యాన్స్ మీట్‌లో బిజీగా ఉన్న చెర్రీని చూడగానే అభిమాని కన్నీటి పర్యంతమయ్యాడు. అభిమాన హీరోను చూడగానే కన్నీళ్లు తన్నుకొచ్చేశాయేమో గానీ బోరున విలపించాడు. దీంతో అబ్బాయిని రామ్ చరణ్ దగ్గరికీ పిలిచి మరీ వివరాలు ఆరా తీశారు. ఆ తర్వాత సెక్యూరిటీకి అతన్ని సురక్షితంగా ఇంటికి పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీంతో చెర్రీ అభిమానులు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. దటీజ్ రామ్ చరణ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. 

కాగా.. రామ్ చరణ్ తన తదుపరి చిత్రం ఆర్సీ15లో షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవలే కర్నూలు, హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకున్న చిత్రబృందం తదుపరి షెడ్యూల్ కోసం వైజాగ్ చేరుకుంది. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top