Ram Charan heads to Kurnool to shoot for #RC15 - Sakshi
Sakshi News home page

Ram Charan : కర్నూలులో రామ్‌చరణ్‌ సినిమా షూటింగ్‌

Published Sat, Feb 11 2023 2:25 PM

Ram Charan Heads To Kurnool To Shoot For RC15 - Sakshi

కర్నూలు: నగరంలోని కొండా రెడ్డి బురుజు వద్ద సినిమా షూటింగ్‌ సందడి నెలకొంది. శుక్రవారం మెగా సినీ హీరో రామ్‌చరణ్‌ తేజ్, నటులు శ్రీకాంత్, రాజీవ్‌ కనకాలపై కొండారెడ్డి బురుజుపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. రామ్‌ చరణ్‌ తేజ్‌ హీరోగా దిల్‌రాజు నిర్మాతగా శంకర్‌ దర్శకత్వంలో కొత్త చిత్రం షూటింగ్‌ కొనసాగుతోంది.

సినిమాలో హీరో ఒక రాజకీయ పార్టీ నాయకునిగా ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్న దృశ్యాలు చిత్రీకరించారు. సినిమా హీరో, నటులను, సినిమా షూటింగ్‌ చూసేందుకు కొండారెడ్డి బురుజు ప్రాంతానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

Advertisement
Advertisement