
వెంకట సతీష్, రామ్‌చరణ్, ఏఆర్ రెహమాన్, బుచ్చిబాబు
రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.
ఈ మూవీ 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి మొదటి పాటని త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు రామ్‌చరణ్, బుచ్చిబాబు, వెంకట సతీష్ కలిసి ఏఆర్ రెహమాన్ స్టూడియోలో ఉన్న ఫోటోని షేర్ చేసింది యూనిట్. ఈ చిత్రానికి కెమెరా: ఆర్. రత్నవేలు, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్.