
నటి రెజీనా(Regina Cassandra) తెలుగులోనే కాదు తమిళ్, మలయాళం, కన్నడం, హిందీ తదితర భాషల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. పలు చిత్రాల్లో ఐటమ్స్ సాంగ్స్‌తో కూడా మెప్పించిన ఆమెకు అనుకున్నంత రేంజ్ విజయాలు దక్కకపోయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం భారీగానే ఉన్నారు. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఒక సందర్భంలో తాను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పాల్సిన అవసరం ఎందుకొచ్చిందో సరదాగా పంచుకుంది.
సుమారు పదేళ్ల క్రితం ఒకసారి బెంగళూరులో అర్ధరాత్రి 12 గంటల ప్రాంతలో స్నేహితురాళ్లతో కలిసి వెళుతుండగా తనకు లస్సీ తాగాలనిపించిందని గుర్తు చేసుకున్నారు. అప్పుడే మూస్తున్న ఒక షాప్ వద్దకు వెళ్లి లస్సీ కావాలని అడిగానన్నారు. అందుకు ఆ షాప్ యజమాని చిరాకుగా లస్సీ లేదు ఏమీలేదు వెళ్లు అని అన్నాడని తెలిపారు. వెంటనే తాను గర్భంతో ఉన్నాను. నాకు లస్సీ ఇస్తే ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని అన్నానన్నారు. దీంతో తన స్నేహితురాళ్లు షాక్‌కు గురయ్యారన్నారు.
అయితే, ఆ షాప్ అతను ఎక్కడ రెజీనా గర్భవతి అని అందరికీ చెబుతారో అని తన ఫ్రెండ్స్ కూడా భయపడ్డారన్నారు. అదృష్టవశాతు అతను ఎవరికీ చెప్పలేదని తెలిపారు. ఇలాంటి తమాషాలు చాలా చేశానని, ఇప్పటికీ చేస్తుంటానని రెజీనా అన్నారు. అయితే, కొంత కాలం తర్వాత మీడియాలో మాత్రం ఇదే విషయంపై మరో విధంగా ప్రచారం జరిగిందని గుర్తుచేసుకున్నారు.