నా చిరునవ్వే ‘అమ్మ’కు వెలుగు: వైష్ణవీ చైతన్య | Vaishnavi Chaitanya Interview with Sakshi | Sakshi
Sakshi News home page

నా చిరునవ్వే ‘అమ్మ’కు వెలుగు: వైష్ణవీ చైతన్య

Oct 20 2025 5:48 AM | Updated on Oct 20 2025 5:48 AM

Vaishnavi Chaitanya Interview with Sakshi

‘‘పర్యావరణం బాగుంటే మన పరిసరాలన్నీ బాగుంటాయి. అందుకే ‘ఎకో ఫ్రెండ్లీ’ దీపావళికి ప్రాధాన్యం ఇస్తాను’’ అంటున్నారు ‘బేబీ’ మూవీ ఫేమ్‌ వైష్ణవీ చైతన్య. అంతేకాదు... దీపావళి అంటే తన ‘పెట్‌’ సౌకర్యం కూడా ఆలోచిస్తారీ బ్యూటీ. బుజ్జి కుక్కపిల్ల గురించి, ఇంకా తమ ఇంటి దీపావళి పండగ విశేషాల గురించి అచ్చ తెలుగు కథానాయిక వైష్ణవీ చైతన్య ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్న విశేషాలు.

మా ఇంట్లో వారం రోజుల ముందే పండగ సందడి మొదలైపోయింది. హాల్‌లో ఎలాంటి దీపాలు పెట్టాలి... బాల్కనీని ఎలా అలంకరించాలని నేను, మా అమ్మ రకరకాల ప్లాన్స్‌ చేసుకున్నాం. మార్కెట్‌కి వెళ్లి స్వయంగా దీపాలు, పువ్వులు కొనడం నాకు చాలా ఇష్టం. కానీ ఈ సంవత్సరం కుదరలేదు. అయితే మా అమ్మ వెళ్లి, అన్నీ తీసుకొచ్చింది కాబట్టి హ్యాపీ. దీపావళి రోజు బంధువులకు, స్నేహితులకు ఇవ్వడానికి గిప్ట్స్‌ రెడీ చేయడం కూడా వారం రోజులు ముందే మొదలుపెట్టాం.

⇒  మేం లక్ష్మీదేవి పూజ బాగా చేసుకుంటాం.  పోద్దున్నుంచీ సాయంత్రం వరకూ చాలా హడావిడిగా ఉంటుంది. మాది లేట్‌ నైట్‌ పూజ. రాత్రి దాదాపు పదకొండు గంటలకు పూజ పూర్తవుతుంది. ఆ తర్వాత ఇంటి బయటికొచ్చి, దీపావళి సెలబ్రేట్‌ చేస్తాం.

⇒  మా ఇంట్లో ఒక పెట్‌ ఉంది. ప్రతి దీపావళిని మేం గ్రాండ్‌గా జరుపుకుంటున్నా మరోవైపు మనసులో మా పెట్‌ గురించి ఆలోచించుకుని, కొంచెం ఫీల్‌ అవుతాం. ఎందుకంటే వాడికి (పెట్‌ని ఉద్దేశించి) క్రాకర్స్‌ స్మెల్‌ పడదు... పైగా సౌండ్స్‌ అంటే భయం. పండగ టైమ్‌లో సిక్‌ అయిపోతాడు. అందుకే మేం సింపుల్‌ క్రాకర్స్‌ కాలుస్తాం. పైగా పర్యావరణం కలుషితం కాకూడదనే ఫీల్‌ కూడా ఉండటంతో ‘ఎకో ఫ్రెండ్లీ’ దీపావళిని ప్రిఫర్‌ చేస్తాం.

⇒  దీపావళి అవుట్‌ఫిట్‌ అంటే... చీర లేదా చుడీదార్‌. అయితే ఎక్కువగా చీర కట్టుకుంటాను. డెకరేషన్‌ చేస్తున్నప్పటి నుంచి పూజ వరకూ దాదాపు చీరలోనే ఉంటాను. క్రాకర్స్‌ కాలుస్తున్నప్పుడు చీర అంత సౌకర్యంగా ఉండదు కాబట్టి షరారా లేకపోతే చుడీదార్‌ వేసుకుంటాను.

⇒  నా జీవితంలో వెలుగు తెచ్చిన వ్యక్తి అంటే మా ‘అమ్మ’. నా బలం, స్ఫూర్తి, శక్తి అన్నీ తననుంచే నాకు వచ్చాయి. ఇంకా నా మొత్తం ఫ్యామిలీ. అమ్మా, నాన్న, బ్రదర్స్, ఇంకా నా చిన్ని పెట్‌... నా జీవితానికి వీళ్లంతా చాలా ముఖ్యం. నా ముఖంలో కనిపించే చిరునవ్వే వారికి వెలుగు. అయితే నీ జీవితానికి వెలుగు ఎవరు అంటే... మా ‘అమ్మ’ని చెబుతాను. ఇవాళ నేను ఇంత మోటివేటెడ్‌గా ఉన్నానంటే తనే కారణం.

⇒  నా లైఫ్‌లో ఇప్పటివరకూ బిగ్గెస్ట్‌ దీపావళి అంటే ప్రత్యేకంగా ఒకటని చెప్పలేను. అన్ని పండగల్లోకల్లా మా ఫ్యామిలీకి దీపావళి చాలా ముఖ్యం. ఆ రోజు ‘నోము’ అని ఒక పూజ చేస్తుంటాం. సత్యనారాయణ వ్రతం కూడా చేస్తాం. మా అమ్మా నాన్న ఉపవాసం ఉంటారు. ఇయర్‌లో ఇదే పెద్ద ఫెస్టివల్‌ అన్నట్లుగా జరుపుకుంటాం. బంధువులను కూడా పూజకు పిలుస్తాం. అందుకే దీపావళి మా కుటుంబానికి ఓ అందమైన పండగ.

⇒  ఊహ తెలిశాక దీపావళి  పండగను ఎంజాయ్‌ చేయడం మొదలుపెట్టాను. నేను, అమ్మ మార్కెట్‌కి బోలెడన్ని పువ్వులు, ఇంకా డెకరేషన్‌కి కావల్సినవి చాలా కొనేవాళ్లం. ఇన్నిన్ని ఎందుకు కొంటారు? అని డాడీ సరదాగా అంటుంటారు. మూడు రోజుల పాటు డెకరేషన్‌ అలానే ఉంచుతాం. దీపావళి రోజు సాయంత్రం చేసే పూజ కోసం  పోద్దున్నుంచే పనులు మొదలుపెట్టేస్తాం. చివరికి అలసిపోతుంటాం (నవ్వేస్తూ). 

⇒  ఇప్పటివరకూ మూవీ సెట్స్‌లో దీపావళి పండగ చేసుకోలేదు. అయితే ఆ అవకాశం రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సెట్స్‌లో చాలామంది ఉంటారు. అందరితో సరదాగా మాట్లాడు కుంటూ, స్వీట్స్‌ షేర్‌ చేసుకుంటూ, ఫొటోలు దిగుతూ పండగ చేసుకుంటే ఆ హ్యాపీనెస్‌ వేరుగా ఉంటుంది.             

దీపావళి ... తీపి గుర్తు
నాకు చిన్నప్పుడు దీపావళి అంటే ఫుల్‌ భయం. టపాసుల సౌండ్‌కి భయపడి దాక్కోవడమే (నవ్వుతూ). సో... మా అమ్మా నాన్న, బ్రదర్స్‌... ఇలా ఫ్యామిలీ మెంబర్స్‌ అందరూ దగ్గరుండి నాకు ధైర్యం చెప్పి, కాకర పువ్వొత్తులు వంటివి కాల్పించేవారు. దీపావళికి సంబంధించి నాకు అదో తీపి గుర్తు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement