రాజ్ బి. శెట్టి, స్వాదిష్ట, అర్చన కొట్టిగే ప్రధాన పాత్రల్లో నటించిన కన్నడ చిత్రం ‘రాక్కాసపురధోల్’. రవి సారంగ దర్శకత్వంలో కె. రవి వర్మ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 6న కన్నడలో విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ‘రాక్షసపురం’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కేఎస్ రామారావు మే 1న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా కేఎస్ రామారావు మాట్లాడుతూ– ‘‘అద్భుతమైన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘రాక్షసపురం’. రాజ్ బి. శెట్టి పోలీసు ఇన్‌స్పెక్టర్ పాత్రలో అద్భుతంగా నటించారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ కష్టకాలంలో ఉంది. ఐపీఎల్ ప్రభావం, ఓటీటీ పోటీ వల్ల థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గుతోంది. అయినప్పటికీ ‘రాక్షసపురం’ లాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తాయనే నమ్మకం ఉంది’’ అని తెలి పారు. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడారు.


