రాజుగారి దొంగలు వస్తున్నారు | Raju Gari Dongalu Movie Teaser Launch | Sakshi
Sakshi News home page

రాజుగారి దొంగలు వస్తున్నారు

Jan 6 2025 3:49 AM | Updated on Jan 6 2025 3:49 AM

Raju Gari Dongalu Movie Teaser Launch

∙కైలాష్, జోషిత్, రాజేశ్, లోహిత్‌ కల్యాణ్‌

లోహిత్‌ కల్యాణ్, రాజేశ్‌ కుంచాడా, జోషిత్‌ రాజ్‌ కుమార్, కైలాష్‌ వేలాయుధన్, పూజా విశ్వేశ్వర్, టీవీ రామన్, ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాజుగారి దొంగలు’. లోకేశ్‌ రనల్‌ హిటాసో దర్శకత్వంలో నడిమింటి లిఖిత సమర్పణలో నడిమింటి బంగారు నాయుడు నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది.

ఈ మూవీ టీజర్‌ లాంచ్‌ వేడుకకి ప్రోడ్యూసర్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ దామోదర ప్రసాద్, నిర్మాత బెక్కెం వేణుగోపాల్, నటుడు సురేష్‌ అతిథులుగా హాజరై, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. లోహిత్‌ రనల్‌ మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్‌ కావాలనే నా కలను, నన్ను నమ్మి మా నాన్న బంగారు నాయుడుగారు ఈ మూవీని నిర్మించారు. మా మూవీకి ప్రేక్షకాదరణ దక్కుతుందని నమ్ముతున్నాం’’ అన్నారు. ‘‘టీజర్‌ ఎంత బాగుందో సినిమా కూడా అంతే బాగుంటుంది’’ అని నడిమింటి బంగారు నాయుడు చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement