నవ్వులతో స్వాగతం

Raj Tarun orey bujjiga movie updates - Sakshi

రాజ్‌ తరుణ్‌ హీరోగా, మాళవికా నాయర్, హెబ్బా పటేల్‌ హీరోయిన్లుగా కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా..’. లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కేకే రాధామోహన్‌ నిర్మించిన ఈ సినిమాని నూతన సంవత్సరం కానుకగా జనవరి 1న థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. కేకే రాధామోహన్‌ మాట్లాడుతూ – ‘‘ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. మా సినిమా చూసిన ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు. 2021కి స్వాగతం పలుకుతూ మా చిత్రం విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్, కెమెరా: ఐ. ఆండ్రూ.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top