విచారణకు రాలేనంటూ పోలీసులకు లేఖ రాసిన రాజ్‌ తరుణ్‌ | Raj Tarun Not Attend Police Enquiry | Sakshi
Sakshi News home page

విచారణకు రాలేనంటూ పోలీసులకు లేఖ రాసిన రాజ్‌ తరుణ్‌

Jul 19 2024 3:13 PM | Updated on Jul 19 2024 3:26 PM

Raj Tarun Not Attend Police Enquiry

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి నార్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో చిత్రసీమలో ఈ వార్త వైరల్‌ అయింది. తనను ప్రేమించిన తర్వాత హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రాతో రాజ్‌ తరుణ్‌ ఎఫైర్‌ పెట్టుకున్నాడని లావణ్య తెలిపింది. తనకు అబార్షన్‌ కూడా చేపించాడని ఆమె ఆరోపించింది. ఈ కేసులో రాజ్ తరుణ్‌కి నార్సింగ్‌ పోలీసులు నోటీసులు పంపించారు. ఈనెల 18 లోపు విచారణకు హాజరు కావాల్సిందేనని ఇందులో పేర్కొన్నారు. అయితే, రాజ్‌ తరుణ్‌ పలు కారణాలు చెబుతూ విచారణకు హాజరు కాలేకపోయారు.

పోలీసుల విచారణకు రాలేనంటూ రాజ్‌ తరుణ్‌ నార్సింగ్‌ పోలీసులకు తెలిపారు. ఈమేరకు ఆయన ఒక లేఖ రాసి తన లాయర్‌ ద్వారా నార్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌కు పంపారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నట్లు ఆయన చెప్పారు. కొద్దిరోజుల్లో తను నటించిన సినిమా విడుదల కానున్నడంతో ఇప్పట్లో విచారణకు రాలేనని లేఖ ద్వారా ఆయన పేర్కొన్నారు. మరో రోజు విచారణకు తప్పకుండా వస్తానని ఆయన తెలిపారు.

చట్టానికి లోబడే పోలీసులు ఈ లేఖను ఆమోదించారు.  ఈ క్రమంలో మరోసారి రాజ్ తరుణ్‌కు నోటీసులు పంపనున్నారు. రెండోసారి నోటీసులు జారీ చేశాక  రాజ్ తరుణ్ స్పందించకపోతే తగు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement