నాట్‌ అధ్యక్షుడిగా టాలీవుడ్‌ నిర్మాత | Raj Allada Appointed As A NATS President | Sakshi
Sakshi News home page

నాట్‌ అధ్యక్షుడిగా టాలీవుడ్‌ నిర్మాత

Jun 3 2026 12:44 PM | Updated on Jun 3 2026 12:50 PM

Raj Allada Appointed As A NATS President

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (ఎన్‌.ఎ.టి.ఎస్‌) నూతన అధ్యక్షుడిగా టాలీవుడ్‌ నిర్మాత(ఇటీవల వచ్చిన నిలవే చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడు) రాజ్‌ అల్లాడ ఎన్నికయ్యారు. 2026–2028కి గాను నూతన కమిటీ, ఎగ్జిక్యూటివ్‌ కమిటీని ఎన్నుకున్నారు. న్యూజెర్సీకి చెందిన టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌ రాజ్‌ అల్లాడ 2009 నుంచి ‘ఎన్‌.ఎ.టి.ఎస్‌’లో వాలంటీర్‌గా సేవలందిస్తున్నారు. సంస్థలో పలు బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు పలుమార్లు  బోర్డ్‌ మెంబర్‌గా చేశారు. 

సేవా కార్యక్రమాల పట్ల ఆయన చూపిన నిబద్ధత, తపన వల్ల అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా రాజ్‌ అల్లాడ, వైస్‌ ప్రెసిడెంట్‌గా (ప్రోగ్రామ్స్‌) రాజేష్‌ కండ్రు, వైస్‌ ప్రెసిడెంట్‌గా (ఫైనాన్స్‌ అండ్‌ మార్కెటింగ్‌) అనుదీప్‌ అర్లా, వైస్‌ ప్రెసిడెంట్‌గా (సర్వీసెస్‌) రాజ్యలక్ష్మి చిలుకూరి, కార్యదర్శిగా సుధీర్‌ మిక్కిలినేని, ఖజాంచీగా రామ్‌ నరేష్‌ కొమ్మనబోయిన, జాయింట్‌ సెక్రటరీగా భానులంక, జాయింట్‌ ట్రెజరర్‌గా వెంకట శాఖమూరి బాధ్యతలు చేపట్టనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement