PVT04 Movie Announcement: వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా.. ఆకట్టుకుంటున్న వీడియో

PVT04 Shooting Started Announcement Video Released: పంజా వైష్ణవ్ తేజ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వైష్ణవ్ 'రంగరంగ వైభవంగా' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణంలో మరో చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ సినిమా నేడు జూన్ (22) ఉదయం 11.16 నిమిషాలకు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో అతిరథుల మధ్య వైభవంగా ముహూర్తం జరుపుకుంది. సుప్రసిద్ధ దర్శకు డు త్రివిక్రమ్, హీరో సాయి ధర్మ తేజ్, హారిక అండ్ హాసిని సంస్థ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు), దర్శకుడు సుధీర్ వర్మ, మరో దర్శకుడు కల్యాణ్ (అనగనగా ఒక రాజు) లు చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ముహూర్తపు దృశ్యానికి దర్శకత్వం త్రివిక్రమ్ వహించారు. హీరో సాయిధర్మ తే జ్ క్లాప్ ఇవ్వగా,దర్శకుడు సుధీర్ వర్మ కెమెరా స్విచాన్ చేశారు. స్క్రిప్ట్ ను నిర్మాత ఎస్.నాగవంశీ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ కు అందించారు. చిత్రం ముహూర్తం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ప్రచారచిత్రాన్ని విడుదల చేసింది చిత్రం యూనిట్. ఇందులో "రేయ్ రాముడు లంక మీద పడ్డం ఇనుంటావ్. అదే పది తలకాయలోడు అయోధ్య మీద పడితే ఎట్టుంటదో సూస్తావా..." అని చిత్రంలో ప్రతినాయక పాత్ర హెచ్చరిక గా అంటే.. "ఈ అయోధ్యలో ఉండేది రాముడు కాదప్పా.. ఆ రావణుడే కొలిసే రుద్ర కాళేశ్వరుడు.. సూస్కుందాం రా.. తలలు కోసి సేతికిస్తా నాయాలా..!" అంటూ కథానాయకుడు మరింత గా హెచ్చరించడం చూడొచ్చు. పదునైన ఈ సంభాషణలకు సమకూర్చిన నేపథ్య సంగీతం మరింత పౌరుషాన్ని పెంచినట్లయింది. ఈ మూవీని 2023 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నారు.
చదవండి: బుల్లితెర నటి ఆత్మహత్య.. అతడే కారణమని తండ్రి ఆరోపణ
#PVT04 ~ #ProductionNo16 begins with a pooja ceremony today✨
Shoot begins soon! 🎬🎥
Directed by #SrikanthNReddy
Produced by @vamsi84 & #SaiSoujanya#PanjaVaisshnavTej @sreeleela14 @SitharaEnts @Fortune4CinemasSankranthi 2023 Release ⚡ pic.twitter.com/UxGDdh35Wm
— Sithara Entertainments (@SitharaEnts) June 22, 2022
సంబంధిత వార్తలు