Primeshow Entertainment Donates Rs. 1 Lakh To TNR Family - Sakshi
Sakshi News home page

TNR ఫ్యామిలీకి ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్థిక సాయం

May 12 2021 1:10 PM | Updated on May 12 2021 4:07 PM

Primeshow Entertainment Donates RS 1 Lakh To TNR Family - Sakshi

ప్రముఖ యాంకర్‌, నటుడు, జర్నలిస్టు టీఎన్‌ఆర్‌ (తుమ్మల నరసింహారెడ్డి) కరోనా కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే.  కొద్ది రోజుల క్రితం కోవిడ్‌ బారిన పడిన ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స‌ పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. టీఎన్‌ఆర్‌ మృతి పట్ల సనీ ప్రముఖులు దిగ్భ్రాంతి తెలపడంతో పాటు ఆర్థిక సాయం చేసి ఆయన కుటుంబానికి అండగా నిలిచారు.  మంగళవారం మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయలతో పాటు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు యాభై వేల రూపాయలను టీఎన్నార్ కుటుంబానికి ఆర్థిక సాయంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

తాజాగా ఆయన కుటుంబానికి ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌  లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేసింది. ‘ప్రముఖ సినీ జర్నలిస్ట్‌,యాంకర్‌, సినీ నటుడు టీఎన్‌ఆర్‌ ఆకస్మిక మరణవార్త విని మేము దిగ్భ్రాంతికి గురయ్యాం. తక్షణ ఖర్చుల నిమిత్తం టీఎన్‌ఆర్‌ కుటుంబానికి రూ.1 లక్షను ఆర్థిక సాయంగా అందించాలని నిర్ణయించుకున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. అలాగే ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఓం శాంతి’అని నిర్మాణ సంస్థ పేర్కొంది.
చదవండి:
TNR కుటుంబానికి చిరంజీవి, సంపూర్ణేష్‌ బాబు ఆర్థిక సహాయం
TNR : కన్నీళ్లు తెప్పిస్తున్న టీఎన్‌ఆర్‌ చివరి పాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement