Prasanna Kumar Talk About Ravi Teja Dhamaka Movie - Sakshi
Sakshi News home page

నాలోనే ఓ చిన్న రవితేజ ఉన్నాడు... ‘ధమాకా’ అలా ఉంటుంది: ప్రసన్న కుమార్

Dec 10 2022 6:20 PM | Updated on Dec 10 2022 6:54 PM

Prasanna Kumar Talk About Ravi Teja Dhamaka Movie - Sakshi

‘రవితేజ కోసం కథ రాయడం పెద్దగా కష్టం అనిపించలేదు. ఎందుకంటే నాలోనే ఓ చిన్న రవితేజ ఉన్నాడు.  నా వ్యక్తిత్వం కూడా ఆయనలాగే ఉంటుంది. నా గత సినిమాలు చూసినా కూడా అందులో హీరో పాత్రలలో రవితేజ ప్రభావం ఉంటుంది. తెలియకుండానే ఆయన ఇంపాక్ట్‌ నాలో ఉంది’అని సినీ రచయిత ప్రసన్న కుమార్‌ బెజవాడ అన్నారు.  మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన  మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ధమాకా'. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.  డిసెంబర్ 23న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా  ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించిన ప్రసన్న కుమార్‌ తాజాగా మీడియాలో ముచ్చటించారు. ఆ విశేషాలు.

► వివేక్ గారు నేను కలసి ఒక సినిమా చేయాలని అనుకున్నాం. మొదట వాళ్లకి సైన్ చేశాను. అదే సమయంలో రవితేజ గారు నా వర్క్ నచ్చి అభినందించాలని పిలిచారు. తర్వాత చాలా రోజులు సరదాగా మాట్లాడుకున్నాం. నేను ఏదీ ఆశించలేదు. కొన్ని రోజుల జర్నీ తర్వాత ..'ఏదైనా  ఉంటే చెప్పు.. మనం చేద్దాం' అని రవితేజ గారు అన్నారు.  దీంతో వర్క్ చేయడం స్టార్ట్ చేశాం. మొదట ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం. అయితే వేరే కారణాలు వల్ల అది కురలేదు. తర్వాత ధమాకా కథ చెప్పాను. లాక్ డౌన్ లో స్క్రిప్ట్ వర్క్ అంతా కంప్లీట్ చేశాం.  ఎంటర్ టైన్ మెంట్ అనేది రవితేజ బలం. మా బలం కూడా అదే.  ఇద్దరం కలసి మంచి ఎంటర్ టైనర్ చేయాలని ధమాకా చేశాం. 

► ఈ చిత్రంలో రవితేజది డ్యూయల్‌ రోల్‌.  ఒక రిచ్ క్యారెక్టర్, ఒక పూర్ క్యారెక్టర్ వుంటుంది. ఒక ఇన్సిడెంట్‌ని రెండు డిఫరెంట్ క్యారెక్టర్లు ఎలా చూస్తారనేదానిపై బేస్ అయిన సినిమా.  రౌడీ అల్లుడికి మరో వెర్షన్ అనుకుంటున్నాను. 

► ఈ చిత్రంలో రావు రమేష్ హైపర్ ఆది కాంబినేషన్ అవుట్ స్టాండింగ్ గా ఉంటుంది. వాళ్ళు కనిపిస్తే చాలు నవ్వుతారు. కొంతమందికి సినిమా చూపించాం. చూసిన వారంతా అవుట్ స్టాండింగ్ అంటున్నారు. అలీ గారి పాత్ర కూడా బాగుంటుంది. హీరో హీరోయిన్ మధ్య సీక్వెన్స్ లు, ఆఫీస్ సీన్స్ హిలేరియస్ గా ఉంటాయి. ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఐదు నిమిషాల ఎపిసోడ్ సినిమా రేంజ్ ని డిసైడ్ చేసే ఎంటర్ టైన్ మెంట్ సీక్వెన్స్. 

► దర్శకుడు త్రినాథరావు నక్కినతో నాకు మంచి బాండింగ్‌ ఉంది. నేను ఒక సీన్ చెబితే దాని అవుట్ పుట్ ఎలా ఉంటుందో ఆయన కి తెలిసిపోతుంది. డైలాగ్‌ రాసిన తర్వాత ఈ సీన్‌ బాగుంటుందని చెబితే.. నాపై నమ్మకంతో వదిలేస్తాడు.  బయట ఈ కంఫర్ట్ ఉండకపోవచ్చు. మా ఇద్దరికి మంచి సింక్ కుదిరింది.

► కథ రాసి పేపర్లు ఇచ్చిపోయే రైటర్‌ని కాదు నేను. సినిమా ప్రాసస్ ని ఎంజాయ్ చేస్తాను. సినిమా సెట్ లో ఉంటాను.  నేను పెట్టిన ఎఫర్ట్ కి తగ్గట్టె పారితోషికం ఇస్తారు. 

► చిన్న స్థాయి నుంచి వచ్చి  స్టార్ రైటర్ గా ఎదిగారని ఎవరైన అంటుంటే ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు నేను అమ్మానాన్నలకు బెటర్‌ లైఫ్‌ని ఇస్తున్నాను.  ఇంట్లో వాళ్ళకి కావాల్సింది ఇవ్వగలుగుతున్నాను. వాళ్ళ అవసరాలని తీరుస్తున్నపుడు మనం సక్సెస్ అయ్యామనే ఫీలింగ్ కలుగుతుంటుంది. 

► నాగార్జున గారి కోసం ఒక స్క్రిప్ట్ చేస్తున్నాను. ఇది రీమేక్ అని వార్తలు వచ్చాయి. అది అవాస్తవం. నా సొంత కథే. విశ్వక్ సేన్ చేస్తున్న దాస్ కా ధమ్కి షూటింగ్ పూర్తి చేసుకుంది. మరో చిన్న సినిమా కూడా చేస్తున్నా. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement