లోక్‌సభలో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు వీగిపోయింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు ఫుల్‌స్టాప్ పడింది. బీజేపీ డీలిమిటేషన్ కుట్రలను ఓడించామని విపక్షాలు చెబుతున్నాయి. దీంతో లోక్‌సభ స్థానాల సంఖ్యను 816 పెంచేందుకు మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ బిల్లుకు బ్రేక్ పడటంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ పేజీలో విపక్షాలపై మండిపడ్డారు. దీంతో ఆయనకు కౌంటర్‌గా సినీ నటుడు ప్రకాష్ రాజ్ పలు వ్యాఖ్యలు చేశారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అంశంలో విపక్షాలు వ్యతిరేఖంగా నిలబడ్డాయని పవన్ కల్యాణ్ ఇలా అన్నారు. భారత చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెంచే చారిత్రాత్మక అవకాశాన్ని విపక్షాలు కావాలనే అడ్డుకున్నాయని పవన్ పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించడంతో విపక్షాలు జాతీయ ప్రగతిని అడ్డుకోవడంతో పాటు తమ రాజకీయ సమీకరణాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయని పవన్ తెలిపారు. అయితే. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ చేశారు.
పవన్ మీరు సిద్ధమేనా..?: ప్రకాష్ రాజ్
దయచేసి ప్రధాని మోదీని మెప్పించడం కోసం పౌరులకు అబద్ధాలు చెప్పడం ఆపాలని పవన్ కల్యాణ్‌కు ప్రకాష్ రాజ్ సూచించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు 2023లోనే ఆమోదించబడిందని గుర్తు చేశారు. దాన్ని ఇప్పుడైనా ఆమోదించవచ్చని చెప్పుకొచ్చారు. 'కానీ, మీ ముఠా డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేయాలని చూసింది, ఇది ఆంధ్రప్రదేశ్‌తో సహా దక్షిణ భారత రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని బలహీనపరుస్తుందని ప్రకాష్ రాజ్ అన్నారు. మిమ్మల్ని డీసీఎం చేసిన ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని, రాష్ట్ర హక్కులను అమ్ముకోవద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ అంశం గురించి వివరించడానికి మీతో చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధమేనా..? ' అంటూ పవన్ కల్యాణ్‌ను ప్రకాష్ రాజ్ కోరారు.
Please stop lying to citizens just to please Modi. Women reservation bill was approved in 2023 itself. It can be passed even now . But your gang wanted to pass Delimitation bill which would weaken the representation of South Indian states including Andhra Pradesh. Requesting you… https://t.co/LyQGy2Fh8E
— Prakash Raj (@prakashraaj) April 18, 2026


