బీచ్ ఒడ్డున చెత్త ఎత్తిన హీరోయిన్ పూజా హెగ్డే | Pooja Hegde In Juhu Beach Cleaning Programme Latest | Sakshi
Sakshi News home page

Pooja Hegde: క్లీనింగ్ ప్రోగ్రామ్‌లో బుట్టబొమ్మ.. వీడియో వైరల్

Jun 1 2024 5:36 PM | Updated on Jun 1 2024 6:45 PM

Pooja Hegde In Juhu Beach Cleaning Programme Latest

హీరోయిన్ పూజా హెగ్డే చాన్నాళ్ల తర్వాత బయట కనిపించింది. గత కొన్నాళ్లుగా చేసిన సినిమా చేసినట్లు ఫ్లాప్ కావడంతో ఛాన్సులు తగ్గిపోయాయి. ప్రస్తుతానికైతే హిందీలో ఒక్క మూవీ చేస్తుందంతే. అలాంటిది ఇప్పుడు ఓ క్లీనింగ్ ప్రోగ్రామ్‌లో పాల్గొని తన వంతు బాధ్యత నిర్వర్తించింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

(ఇదీ చదవండి: విడాకుల బాటలో మరో టాలీవుడ్ హీరోయిన్.. ఏమైందంటే?)

ముంబయి బ్యూటీ పూజా హెగ్డే.. 12 ఏళ్ల క్రితమే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. పలు తెలుగు సినిమాలు ఈమెకు స్టార్ హీరోయిన్ హోదా తీసుకొచ్చాయి. ఎంత వేగంగా సక్సెస్ వచ్చిందో అంతే ఫాస్ట్‌గా మూవీస్ వరసగా ఫెయిలయ్యాయి. దీంతో దక్షిణాది నుంచి ఫేడౌట్ అయిపోయింది. ఇప్పుడు హిందీలో 'దేవ' అనే మూవీ చేస్తోంది. ఇది హిట్ కావడం పూజాకి చాలా ముఖ్యం.

ఇకపోతే తాజాగా ముంబయిలోని జుహూ బీచ్‌లో శనివారం నిర్వహించిన క్లీనింగ్ ప్రోగ్రామ్‪‌లో పూజా పాల్గొంది. చెత్త ఎత్తి పర్యావరణ పరిశుభ్రతలో భాగమైంది. సినిమాలు లేకపోవడం వల్ల ఇలా కాస్త ఖాళీగా ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు చిన్న చిన్న ఈవెంట్స్‌లో కనిపిస్తోంది.

(ఇదీ చదవండి: తమ్ముడికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన లారెన్స్.. ధర ఎంతంటే?)

Advertisement
 
Advertisement
Advertisement