
శివ సాయిరిషి, సంస్కృతి గోరే, విష్ణు ప్రియ, ఉమా మహేశ్వరరావు, తనికెళ్ల భరణి నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'పెళ్లిలో పెళ్లి'. గణేష్ కోలి నిర్మాత. శ్రీకాంత్ సంబరం దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి, యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్ అతిథులుగా హాజరయ్యారు.
డైరెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. షోలాపూర్‌కు తెలుగు వాళ్లు వెళ్లి వందేళ్లవుతోంది. కానీ అక్కడి నుంచి వచ్చి ఒక తెలుగు సినిమాను చేసింది మాత్రమే మేమే. ఆ వినాయకుడే మమ్మల్ని ఇక్కడిదాకా నడిపించాడని అనిపిస్తోంది. ఈ చిత్రం మా అందరికీ ఒక ఎమోషనల్ జర్నీ. ఆ ఎమోషన్ ప్రేక్షకులకు కూడా రీచ్ అవుతుందని నమ్ముతున్నాం అని చెప్పుకొచ్చారు.