'పరమపద సోపానం' మూవీ రివ్యూ | Paramapada Sopanam Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

అర్జున్‌ అంబటి 'పరమపద సోపానం' సినిమా రివ్యూ

Apr 24 2026 3:43 PM | Updated on Apr 24 2026 3:45 PM

Paramapada Sopanam Movie Review And Rating In Telugu

ఇన్నాళ్లు బుల్లితెరపై అలరించిన అర్జున్‌ అంబటి..ఇప్పుడు వెండితెరపై దూసుకెళ్తున్నాడు. రామ్‌ చరణ్‌ పెద్ది సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు హీరోగానూ సినిమాలు చేస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం  'పరమపద సోపానం'. నాగ శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గణపర్తి నారాయణరావు, తేలప్రోలు ప్రసన్న ఆంజనేయులు నిర్మించారు. జెన్నిఫర్‌ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌ నటించిన ఈ చిత్రం నేడు(ఏప్రిల్‌ 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే.. 
హెల్త్ కమిషనర్ సత్యప్రకాశ్ దారుణ హత్యతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. ఈ క్లిష్టమైన కేసును ఛేదించేందుకు పోలీస్ ఆఫీసర్ అశ్వద్ధామ(అజయ్‌ రత్నం) రంగంలోకి దిగుతాడు. అయితే  మృతదేహంపై తర్వాత  చావబోయే వ్యక్తి వేలిముద్రలు దొరకడం కేసును మరింత మిస్టరీగా మారుస్తుంది. చివరకు ఈ కేసులో ప్రధాన సాక్షిగా అర్జున్‌(అర్జున్‌ అంబటి) గుర్తిస్తారు.

అర్జున్ ఒక గేమ్ డిజైనర్. మల్టీనేషనల్ కంపెనీలో చేసుకునే అతను పీటీఎస్‌డీ(Post-Traumatic Stress Disorder) అనే వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. ఎవరో తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారనే భయం అతన్ని వెంటాడుతుంటుంది.అర్జున్ భద్రత కోసం సీఐ నేహా((జెనిఫర్ ఇమాన్యుయేల్)ను నియమిస్తారు. కానీ హత్యలు అక్కడితో ఆగవు… ప్రభుత్వ ఉద్యోగులు షబీనా భేగమ్ పాటు  జాన్ రాజ్ కూడా క్రూరంగా హత్యకు గురవుతారు. ఈ  హత్యల వెనుక ఉన్న అసలు మాస్టర్‌మైండ్ ఎవరు? అర్జున్ ఎందుకు టార్గెట్ అయ్యాడు? హెల్త్ మినిస్టర్ పురుషోత్తం రెడ్డి పాత్ర ఏమిటి? ఈ మొత్తం కథకు ‘పాలకడలి’ గ్రామంతో ఉన్న రహస్య సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌కి వెళ్లి  ‘పరమపద సోపానం’ మూవీ చూడాల్సిందే .

విశ్లేషణ
ఇదొక డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌. దర్శకుడు నాగ శివ తన తొలి చిత్రానికే బలమైన కథను ఎంచుకుని, సోషల్ ఎలిమెంట్‌తో కూడిన కమర్షియల్ సినిమాగా తెరకెక్కించాడు. ఇలా తక్కువ బడ్జెట్‌లో పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా అందించడం పెద్ద ఛాలెంజ్.  ఈ విషయంలో  దర్శకుడు విజయం సాధించాడు. సస్పెన్స్, కామెడీ ఎలిమెంట్స్‌తో ఫస్టాఫ్‌ ఆసక్తికరంగా సాగుతుంది. ఇంటర్వల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థం వచ్చే ప్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ కొంత సాగదీతగా అనిపిస్తుంది.అయితే అందులో టచ్‌ చేసిన సోషల్‌ ఎలిమెంట్‌ బాగుంటుంది.క్లైమాక్స్‌ ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది.

అర్జున్‌ పాత్రకు అర్జున్‌ అంబటి న్యాయం చేశాడు.ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే  ఫైట్‌లో అదరగొట్టేశాడు. హీరోయిన్ జెనిఫర్ ఇమ్మాన్యుల్ కూడా పోలీస్ పాత్రలో మెప్పించింది. ఆమెకు ఒక స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్ లభించింది అని చెప్పాలి. అజయ్ రత్నంకి చాలా కాలం తర్వాత ఒక పవర్ఫుల్ రోల్ దొరికింది. సీనియర్ నటుడు పిల్లా ప్రసాద్ కూడా విలన్ పాత్రలో ఆకట్టుకున్నారు.సాంకేతికంగా సినిమా బాగుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే..  ‘పరమపద సోపానం’  ఎంటర్‌టైన్‌ చేస్తుంది.
- రేటింగ్‌: 2.5/5

Advertisement
 
Advertisement
Advertisement