Paarijatha Parvam: కిడ్నాప్‌ చేయడం ఓ కళ.. నవ్వులు పూయిస్తోన్న ట్రైలర్‌ | Paarijatha Parvam Trailer Trending In YouTube | Sakshi
Sakshi News home page

Paarijatha Parvam: యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతున్న ‘పారిజాత పర్వం’ ట్రైలర్‌

Apr 13 2024 11:12 AM | Updated on Apr 13 2024 11:37 AM

Paarijatha Parvam Trailer Trending In Youtube - Sakshi

సునీల్, శ్రద్ధాదాస్, చైతన్యా రావు, మాళవికా సతీశన్‌ ప్రధాన పాత్రల్లో సంతోష్‌ కంభంపాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘పారిజాత పర్వం’. ‘కిడ్నాప్‌ ఈజ్‌ ఏన్‌ ఆర్ట్‌’ (కిడ్నాప్‌ చేయడం ఓ కళ) అన్నది ట్యాగ్‌ లైన్‌. మహీధర్‌ రెడ్డి, దేవేష్‌ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 19న రిలీజవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ని యాంకర్‌ సుమ కనకాల రిలీజ్‌ చేశారు.

కేక్‌ కట్‌ చేసే సమయంలో లైట్స్‌ ఆర్పుతారట.. మళ్లీ లైట్స్‌ వెలిగేలోపు కేక్‌తో పాటు వాళ్ల ఆవిడ కూడా మన బండిలో ఉండాలి’ అంటూ సునీల్‌ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభం అవుతుంది.  ట్రైలర్‌లోని ప్రతి సన్నివేశం నవ్వులు పూయిస్తుంది. ముఖ్యంగా చివర్లో వైవా హర్ష చెప్పే సినిమా రివ్యూ అయితే హైలెట్‌. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది. ‘‘పారిజాత పర్వం’క్రైమ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌’’ అని యూనిట్‌ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement