అవార్డును పునః పరిశీలించాలని అకాడమీ నిర్ణయం

ONV Cultural Academy To Reconsider Award To Vairamuthu - Sakshi

చెన్నై: సినీ గీత రచయిత వైరముత్తు తీవ్ర భంగపాటుకు గురి కాబోతున్నారని తెలుస్తోంది. ఆయనకు ఓఎన్‌వీ జాతీయ సాహితీ అవార్డును అందజేయనున్నట్టు ఆ అకాడమీ నిర్వాహకులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇంతకు ముందు తమిళంలో పూ, మరియాన్‌ తదితర చిత్రాల్లో కథానాయికగా నటించిన మలయాళ నటి పార్వతి ఓఎన్‌వీ గురుప్‌ అవార్డులు వైరముత్తుకు ప్రకటించడాన్ని తీవ్రంగా విమర్శించారు.

గొప్ప కవి, సినీ గీత రచయిత ఓఎన్‌వీ పేరుతో నెలకొల్పిన అవార్డును లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వైరముత్తుకు ప్రకటించడం ఆయన్ని అగౌరవపరచడమేనని పేర్కొన్నారు. ఇక సంచలన గాయని చిన్మయి కూడా చాలాసార్లు వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆమె కూడా వైరముత్తుకు ఓఎన్‌వీ అవార్డు ప్రకటించడాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో అవార్డు ప్రదానం చేసే విషయాన్ని పునర్‌ పరిశీలించనున్నట్లు ఓఎన్‌వీ కల్చరల్‌ అకాడమీ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

చదవండి : అవార్డు పొందడం సంతోషంగా ఉంది : వైరముత్తు
వైరముత్తుకి పురస్కారం.. హీరోయిన్ల ఆగ్రహం

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top