Nuvve Nuvve@20 Years: 'నువ్వే నువ్వే’లోని ఈ డైలాగ్స్‌ గుర్తున్నాయా?

Nuvve Nuvve 20 Years: Trivikram Srinivas Dialogues - Sakshi

త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను దర్శకునిగా  పరిచయం చేస్తూ... ప్రముఖ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ పతాకంపై 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన సినిమా 'నువ్వే నువ్వే'. తరుణ్, శ్రియ జంటగా నటించారు. ప్రకాశ్ రాజ్, చంద్ర మోహన్, సునీల్, రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, అనితా చౌదరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

2002లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల అభిమానంతో పాటు పురస్కారాలూ దక్కాయి. నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రం విభాగంలో 'సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్'గా 'నువ్వే నువ్వే' నిలిచింది. వెండి నందిని 'స్రవంతి' రవికిశోర్‌కి అందించింది. ఉత్తమ సంభాషణల రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ నంది అవార్డు అందుకున్నారు. ఫిలింఫేర్ సౌత్ అవార్డుల్లో ఉత్తమ సహాయ నటుడిగా ప్రకాశ్ రాజ్ పురస్కారం అందుకున్నారు. ఈ సినిమాలోని డైలాగ్స్‌ అప్పట్లో బాగా పేలాయి. ‘నువ్వే నువ్వే’ విడుదలై సోమవారానికి (అక్టోబర్‌ 10) నాటికి 20 ఏళ్ళు. ఈ సందర్భంగా  ఈ చిత్రంలోని కొన్ని డైలాగులు..
 

 ► అమ్మ, ఆవకాయ్, అంజలి... ఎప్పుడూ బోర్ కొట్టవు. 
 
 ► ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు... పోషించే శక్తి వచ్చేసరికి ప్రేమించే టైం ఉండదు.

 ► కన్నతల్లిని, దేవుణ్ణి మనమే వెళ్లి చూడాలి. వాళ్ళు మన దగ్గరకు రావాలని కోరుకోవడం మూర్ఖత్వం.

 ►ఆడపిల్లలు పుట్టినప్పుడు వాళ్లు ఏడుస్తారు. పెళ్లి చేసుకొని వెళ్లేటప్పుడు మనల్ని ఏడిపిస్తారు. 

 ►సంపాదించడం చేతకాని వాడికి ఖర్చుపెట్టే అర్హత లేదు. చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు. 

 ►డబ్బుతో బ్రెడ్ కొనగలరు, ఆకలిని కొనలేరు. బెడ్ కొనగలరు, నిద్రని కొనలేరు. 

 ► మనం తప్పు చేస్తే తప్పని, కరెక్ట్ చేస్తే రైట్ అని చెప్పేవాళ్ళు మంచివాళ్లు. మనం ఏం చేసినా భరించే వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు. 

 ►ఒకడు రిక్షా తొక్కడం దగ్గర మొదలుపెట్టి కోటీశ్వరుడు అయ్యాడు కదా అని... వారి కొడుక్కి కొత్త రిక్షా కొనిపెట్టి ఎదగమనడం అంత బాగుండదు. 

 ►ఎక్కడికి వెళ్లాలో తెలిసినప్పుడు... ఎలా వెళ్లాలో చెప్పడానికి నేనెవర్ని?

 ►నీ జీవితంలో వంద మార్కులు ఉంటే 20 నాకు, 80 వాడికి. ఇంకో పదిహేను మార్కులు వేసి మీ నాన్నను పాస్ చేయలేవమ్మా?

 ► డబ్బులు ఉన్నవాళ్ళంతా ఖర్చుపెట్టలేరు. ఖర్చు పెట్టేవాళ్లంతా ఆనదించలేరు.  

 ►తాజ్ మహల్... చార్మినార్... నాలాంటి కుర్రాడు చూడటానికే! కొనడానికి మీలాంటి వాళ్ళు సరిపోరు. 

 ► నేను దిగడం అంటూ మొదలుపెడితే ఇది మొదటి మెట్టు. దీని బట్టి నా ఆఖరి మెట్టు ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోండి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top