షూటింగ్‌ను పూర్తి చేసుకుంటున్న కల్యాణ్‌ రామ్‌ కొత్త సినిమా | NKR 19: Kalyan Ram, Rajendra Reddy NKR 19 in Final Schedule of Shooting | Sakshi
Sakshi News home page

Kalyan Ram New Movie: షూటింగ్‌ను పూర్తి చేసుకుంటున్న కల్యాణ్‌ రామ్‌ కొత్త సినిమా

Published Wed, Oct 12 2022 10:50 AM | Last Updated on Wed, Oct 12 2022 10:50 AM

NKR 19: Kalyan Ram, Rajendra Reddy NKR 19 in Final Schedule of Shooting - Sakshi

కల్యాణ్‌రామ్‌ హీరోగా రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ తుది దశకు చేరుకుంది.

‘‘రీసెంట్‌గా జరిగిన గోవా షెడ్యూల్‌తో షూటింగ్‌ దాదాపు పూర్తయింది. ఫైనల్‌ షెడ్యూల్‌ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌తో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. బ్రహ్మాజీ, సప్తగిరి, మాథ్యూ వర్గీస్, రాజీవీ పిళ్లై, రవి ప్రకాష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement