కీర్తి సురేశ్‌ మిస్సింగ్‌: నితిన్‌ ఫిర్యాదుకు పోలీసుల రిప్లై!

Nithin Says Keerthy Suresh Missing, Hyderabad Police Funny Reply - Sakshi

సినిమా షూటింగ్‌ను కూడా పిక్‌నిక్‌ స్పాట్‌గా మార్చేసి తెగ అల్లరి చేసింది ఎవరా అంటే రంగ్‌దే టీమ్‌ పేరే వినిపిస్తుంది. ఆ మధ్య సెట్స్‌లో కీర్తి సురేశ్‌ కాసేపు కునుకు తీస్తే నితిన్‌, దర్శకుడు వెంకీ అట్లూరి ఆమె వెనకాల చేరి ఫొటో దిగడం, దాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో కోపగించుకున్న కీర్తి వారిద్దరి మీదా ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పింది. అన్నట్లుగానే డైరెక్టర్‌ను పరిగెత్తించి మరీ కొట్టింది. తర్వాత నితిన్‌ మాట్లాడుతున్నట్లుగా ఉండే ఓ ఫన్నీ వీడియోను షేర్‌ చేసింది ఇదిలా వుంటే కీర్తిని మరోసారి ఆటపట్టించాడు నితిన్‌.

'కనబడుటలేదు.. డియర్‌ అను, నువ్వు ఎక్కడున్నా రంగ్‌దే ప్రమోషన్స్‌లో జాయిన్‌ అవ్వాలని మా కోరిక.. ఇట్లు నీ అర్జున్..'‌ అని ట్వీట్‌ చేశాడు. దీనికి హీరోయిన్‌ రెండు జడలు వేసుకున్న చిన్నప్పటి ఫొటోను జత చేశాడు. దీనిపై హైదరాబాద్‌ పోలీసులు స్పందిస్తూ.. 'భయపడకండి నితిన్‌.. మేము చూసుకుంటాం' అని సరదాగా రిప్లై ఇచ్చారు. వాళ్ల కామెంట్‌కు చేతులు జోడిస్తూ నితిన్‌ నవ్వుతున్న ఎమోజీలను షేర్‌ చేశాడు. మొత్తానికి వీరి సరదా ట్వీట్లు నెట్టింట అందరినీ నవ్విస్తున్నాయి. కాగా రంగ్‌దే చిత్రం మార్చి 26న రిలీజ్‌ అవుతోంది.

చదవండి: ఈ సారి గొడవ కలవడానికి చెయ్‌.. గెలవడానికి చేయకు‌

రంగ్‌దే ట్రైలర్‌ లాంఛ్‌ ఫొటోల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top