తన రీఎంట్రీపై స్పందించిన నిషా అగర్వాల్‌ | Nisha Agarwal Respond On Her Re Entry In Movies In Live Chat | Sakshi
Sakshi News home page

Nisha Aggarwal: సినిమాల్లో తన రీఎంట్రీపై స్పందించిన నిషా అగర్వాల్‌

Nov 14 2021 4:48 PM | Updated on Nov 14 2021 4:50 PM

Nisha Agarwal Respond On Her Re Entry In Movies In Live Chat - Sakshi

హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ సోదరిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పలు సినిమాల్లో హీరోయిన్‌గా మెప్పించింది నిషా అగర్వాల్‌. కేరీర్‌ ఫామ్‌లో ఉండగానే తన బాయ్‌ఫ్రెండ్‌ కరణ్‌ను వివాహం చేసుకుని సినిమాలకు గుడ్‌బై చెప్పింది. సినిమాలకు దూరమైనప్పటికీ నిషా అప్పుడప్పుడు సోషల్‌ మీడియా వేదికగా ఫ్యాన్స్‌ను పలకిరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌ సెషన్‌కు వచ్చిన ఆమె అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు ఇచ్చింది.

చదవండి: క్రేజీ అప్‌డేట్‌: ‘పుష్ప’రాజ్‌తో సమంత ఐటెం సాంగ్‌?

అలాగే తన ఫ్యామిలీకి సంబంధించిన మధుర జ్ఞాపకాలను అందరికీ చూపించింది. కాజల్‌తో దిగిన కొన్ని ఫొటోలను పంచుకుని నిషా ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్‌ ‘మేడమ్‌ మీ ఫోన్‌ నంబర్‌ ఇవ్వండి’ అని అడగ్గా.. ‘నో. అది మాత్రం అడగకండి. నేను ఇవ్వను. మీరు నాతో ఏదైనా షేర్‌ చేసుకోవాలి అనుకుంటే దయచేసి నాకు మెయిల్‌ పంపించండి. అలాగే ఇన్‌స్టాలో డైరెక్ట్‌ మెస్సేజ్‌ చేయండి’ అని ఘాటూగా సమాధానమిచ్చింది. మరో నెటిజన్‌.. ‘మీకు మళ్లీ సినిమాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? అని అడగ్గా.. ‘మంచి స్క్రిప్ట్‌ వస్తే తప్పకుండా రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను’ అని చెప్పింది. 

చదవండి: ఓటీటీకి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement