రికార్డ్‌ బ్రేక్‌ మూవీ రివ్యూ | Nihar Kapoor Starrer Record Break Movie Review in Telugu | Sakshi
Sakshi News home page

రికార్డ్‌ బ్రేక్‌ మూవీ రివ్యూ.. జయసుధ తనయుడి మూవీ ఎలా ఉందంటే?

Mar 8 2024 6:03 PM | Updated on Mar 8 2024 6:21 PM

Nihar Kapoor Starrer Record Break Movie Review in Telugu - Sakshi

కోటీశ్వరులకు జన్మించిన ఇద్దరు చిన్నారులు అనుకోని పరిస్థితుల వల్ల అనాథలుగా మారతారు. ఆ ఇద్దరు అనాథలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతూ రెజ్లింగ్ ఛాంపియ

మహాశివరాత్రి సందర్భంగా పాన్ ఇండియా మూవీ రికార్డ్ బ్రేక్ మార్చి8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జయసుధ కుమారుడు నిహార్‌ కపూర్‌ హీరోగా నటించాడు. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే.. కోటీశ్వరులకు జన్మించిన ఇద్దరు చిన్నారులు అనుకోని పరిస్థితుల వల్ల అనాథలుగా మారతారు. ఆ ఇద్దరు అనాథలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతూ రెజ్లింగ్ ఛాంపియన్స్‌గా ఎలా నిలిచారు? అలాంటి అనాథలకు స్నేహితురాలు అయిన ఒక అమ్మాయి వాళ్లకు తల్లిగా ఎలా మారింది? వాళ్లు రెజ్లింగ్ వెళ్లడానికి ఆ తల్లి చేసిన త్యాగం ఏంటి? ఇలాంటి విషయాలు తెలియాలంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే! ఈ మూవీలో రైతుల గురించి తల్లి సెంటిమెంట్ గురించి చాలా బాగా చిత్రీకరించారు. సినిమాలో విఎఫ్ఎక్స్ ఆకట్టుకుంటుంది.

ఎవరెలా చేశారంటే?
కొత్త వాళ్లయినా కూడా నిహారి కపూర్, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్, సంజన, సోనియా బాగా నటించారు. సత్య కృష్ణ పాత్ర సినిమా మొత్తానికే హైలైట్‌. విలన్‌గా టి. ప్రసన్నకుమార్ చాలా బాగా నటించారు. మిగతావాళ్లు తమ పాత్రల పరిధి మేర నటించారు. సినిమా నిర్మాణంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కానట్లు కనిపిస్తుంది. చదలవాడ శ్రీనివాసరావు ఎంచుకున్న కథ కాస్త పాతదే అయినా దాన్ని తెరకెక్కించిన విధానం బాగుంది.

సెకండ్ హాఫ్ నిడివి ఎక్కువ ఉండటం, అక్కడక్కడ కొన్ని లాగ్ సీన్స్ ప్రేక్షకుడికి విసుగు పుట్టిస్తాయి. అయితే కొన్నిచోట్ల దర్శకుడు కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. అంగిరెడ్డి శ్రీనివాస్ అందించిన కథ, సాబు వర్గీస్ సంగీతం పర్వాలేదు. డిఓపిగా కంతేటి శంకర్ ఫోటోగ్రఫీ బాగుంది.

చదవండి: ‘భీమా’ మూవీ రివ్యూ

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement