జీఏ 2 బ్యాన‌ర్‌లో నూతన చిత్రం

New Film Starts In GA2 Banner Making By Karuna Kumar - Sakshi

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చ‌ర్స్ బ్యానర్ లో బన్నీ వాసు, విద్య మాధురి నిర్మాతలుగా నూత‌న‌ చిత్రం ప్రారంభమైంది. వ‌రుస స‌క్సెస్ ఫుల్ సినిమాల‌తో తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకొని విజ‌య‌వంత‌మైన సినిమాల‌ను నిర్మిస్తున్న సినీ నిర్మాణ సంస్థ‌గా ఇమేజ్ అందుకున్న జీఏ 2పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ నుంచి ప్రొడ‌క్ష‌న్ 7గా ఈ నూత‌న చిత్రం రాబోతుంది.  

పలాస 1978, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలతో ప్రేక్ష‌కాధ‌‌ర‌ణ అందుకున్న ద‌ర్శ‌కుడు క‌రుణ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్ర‌ముఖ హీరోయిన్ అంజ‌లి, ప్ర‌ముఖ న‌ట‌లు రావు ర‌మేశ్, ప్రియ‌ద‌ర్శీ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైర‌క్ట‌ర్ మెలోడీ బ్ర‌హ్మా మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఫిల్మ్ న‌గ‌ర్ దైవ స‌న్నిధానంలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ సినిమా మొద‌లైంది, అల్లు అన్విత క్లాప్ ఇచ్చి ఈ సినిమాను ప్రారంభించారు, అల్లు అరవింద్ కెమెరా స్విచ్ఛ్ ఆన్ చేశారు. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top