లవ్‌స్టోరీకి పనికి రానన్నారు.. అందుకే ఈ మూవీ చేశాను : హీరో

అభిరామ్ వర్మ , సాత్వికా రాజ్ జంటగా బాలు శర్మ దర్శకత్వంలో ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహల్ జంజాల నిర్మించిన చిత్రం ‘నీతో’. ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు నిర్మాత రాజ్ కందుకూరి, హీరో శివ కందుకూరి, నటుడు శివ, ఐ.ఏ.ఎస్ సురేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అభిరామ్ వర్మ మాట్లాడుతూ – ‘‘నా యాక్టింగ్ లవ్‌స్టోరీలకు పనికి రాదన్నట్లుగా కొందరు మాట్లాడారు. దాంతో మంచి లవ్‌స్టోరీ చేయాలనే కసి పెరిగింది. బాలు శర్మగారు చెప్పిన కథ నచ్చడంతో ఈ డిఫరెంట్ లవ్‌స్టోరీ చేశాను’’ అన్నారు. ‘‘యూత్ ఆడియన్స్ మెచ్చే డిఫరెంట్ కంటెంట్‌తో రూపొందిన ఫ్రెష్ లవ్‌స్టోరీ ‘నీతో’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ‘‘ఫ్యామిలీతో చసే విధంగా ఈ సినిమా ఉంటుంది. అందుకే నేను రిలీజ్ చేస్తున్నాను’’ అన్నారు పీవీఆర్ ఉదయ్.