నేడే విడుదల | Sakshi
Sakshi News home page

నేడే విడుదల

Published Tue, Dec 15 2020 5:56 AM

Nede Vidudala Pre-Look Release - Sakshi

అసిఫ్‌ ఖాన్, మౌర్యాని జంటగా నటించిన చిత్రం ‘నేడే విడుదల’. ఈ సినిమా ద్వారా రామ్‌ రెడ్డి పన్నాల దర్శకునిగా పరిచయమవుతున్నారు. నజురుల్లా ఖాన్, మస్తాన్‌ ఖాన్‌ నిర్మించిన ఈ సినిమా ప్రీ లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. ఆసక్తికరమైన కథ, ఆలోచింపచేసే కథనంతో పాటు ఆహ్లాదపరిచే సంభాషణలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలో సినిమా ఫస్ట్‌ లుక్, సాంగ్‌ని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: అజయ్‌ అరసాడ, కెమెరా: సిహిచ్‌ మోహన్‌ చారి.

Advertisement
 
Advertisement
 
Advertisement