నట్టి హీరోగా సైకో థ్రిల్లర్‌ చిత్రం 

Natty Next To Be a Psychological Thriller - Sakshi

తమిళసినిమా: నటుడు, ఛాయాగ్రాహకుడు నట్టి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్ర షూటింగ్‌ శుక్రవారం చెన్నైలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా హారూన్‌ అనే నవ దర్శకుడు పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది సైకో కిల్లర్‌ కథాంశంతో కూడిన చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో నట్టికి జంటగా నలుగురు కథానాయికలు నటించనున్నారని, వారి ఎంపిక జరుగుతోందని చెప్పారు. ముఖ్యపాత్రల్లో బ్లాక్‌ షీప్‌ నందిని, సాస్వీ బాలా, ప్రీతి నటిస్తున్నారని తెలిపారు. దీనికి కార్తీక్‌ రాజా సంగీతాన్ని, క్రిస్టోఫర్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నట్లు చెప్పారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర కథ పలు ఊహించని మలుపులతో ఆసక్తికరంగా సాగుతుందని దర్శకుడు తెలిపారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top