‘మ్యాడ్, ఆయ్, మ్యాడ్ స్క్వేర్’ చిత్రాల ఫేమ్ నార్నే నితిన్ హీరోగా కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ‘జూనియర్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రాధాకృష్ణ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. కేవీఎన్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మించనున్నారు. నార్నే నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు.
‘ఆకాశంలో ఉంటుంది మూన్... నువ్వే నా లైఫ్‌కి క్వీన్...’ అనే వాక్యాలు పోస్టర్‌లో ఉన్నాయి. హీరో ఎన్టీఆర్ (నార్నే నితిన్ బావ) ఈ పోస్టును లైక్ చేసినట్లు చూపించారు. ‘‘ప్రేమ, హాస్యం, భావోద్వేగాల సమ్మేళనంగా రూపొందనున్న ఈ చిత్రం ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించేలా ఉంటుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ సినిమాకి కెమెరా: రామ మారుతి.


