అతిపెద్ద ఆవిష్కరణగా బిగ్‌బాస్‌: నాగార్జున | Nagarjuna: Bigg Boss 4 Hosting Gives Me Outstanding Satisfaction | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ను ఆదరిస్తున్న వారికి కృతజ్ఞతలు: నాగార్జున

Dec 8 2020 12:33 PM | Updated on Dec 8 2020 1:48 PM

Nagarjuna: Bigg Boss 4 Hosting Gives Me Outstanding Satisfaction - Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌ 4ను హోస్ట్‌ చేయడం తనకు అత్యంత సంతృప్తినిచ్చిందని టాలీవుడ్‌ స్టార్‌ అక్కినేని నాగార్జున అన్నారు. బిగ్‌బాస్‌ను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి వారం కోట్లాదిమంది వీక్షకులకు వినోదం కలిగించడమే అత్యుత్తమ సంతృప్తిగా నిలుస్తుందన్నారు. కాగా స్టార్‌ మా అందిస్తున్న అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 4. సెప్టెంబర్ 6న వైభవంగా ప్రారంభమైన ఈ కార్యక్రమానికి మరో రెండు వారాల్లో శుభం కార్డు పడనుంది. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలతో సహా ఇప్పటి వరకు బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి 19 అడుగు పెట్టగా ప్రస్తుతం హౌజ్‌లో ఆరుగురు పోటీదారులు మాత్రమే మిగిలారు. వీరంతా కూడా ఈ సంవత్సరపు టైటిల్‌ కోసం పోటీపడుతుండటంతో పాటుగా వీలైనంతగా వినోదాన్ని అందిస్తున్నారు. విభిన్న నేపథ్యాల నుంచి కంటెస్టెంట్‌లు ఉండటంతో ఈ క్లైమాక్స్‌ ఖచ్చితంగా వీక్షించేందుకు ఆసక్తిగా ఉండబోతుందని తెలుస్తోంది. చదవండి: నేను అర్హురాలు కాదేమో..: అరియానా

ఈ సీజన్‌ గురించి హోస్ట్‌ నాగార్జున మాట్లాడుతూ ‘‘బిగ్‌బాస్‌ ప్రతి వారం కోట్లాది మందికి వినోదం అందించడం అత్యుత్తమ సంతృప్తిని అందిస్తుంది. అదీ మహమ్మారి విజృంభణ లాంటి కష్టసమయంలో బిగ్‌బాస్‌ సీజన్‌ 4 గత రికార్డులను తుడిచి పెట్టేసింది. అలాగే జాతీయస్థాయిలో బిగ్‌బాస్‌ 3 సీజన్‌ సృష్టించిన రికార్డులను ఇది అధిగమించింది. 20+ టీవీఆర్‌తో ఇది బిగ్‌బాస్‌ షోలలో అతిపెద్ద ఆవిష్కరణగా నిలిచింది. గతవారం ఏపీ మరియు తెలంగాణాలలో 4 కోట్లకు పైగా వీక్షకులు దీనిని వీక్షించడం ఈ షో పట్ల వారి ప్రేమకు నిదర్శనం. గత 12 వారాలలో జంట రాష్ట్రాలలో దాదాపు 83% మంది వీక్షకులు బిగ్‌బాస్‌ సీజన్‌ 4 వీక్షించారు. ఇది అపూర్వం.  ఇప్పుడు మేము అత్యంత ఉత్సాహ పూరితమైన దశలో ప్రవేశించాము. ఈ షో యొక్క ఫైనల్‌ మరింత ఆసక్తిగా ఉండబోతుంది. బిగ్‌బాస్‌ సీజన్‌4 ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అని అన్నారు. చదవండి: మోనాల్ స్ట్రాంగ్‌: బాధ‌ను దిగ‌మింగిన‌ అవినాష్

కాగా ఇప్పటి వరకు విజయవంతంగా మూడు సీజన్‌లు పూర్తి చేసుకున్న ఈ షో.. నాలుగో సీజన్‌లో తమ సొంత రికార్డులనే అధిగమించింది. ప్రతి వారం ఆకట్టుకునే ప్రదర్శనతో 4 జీఈసీలలో 42% వాటా (ఎస్‌డీ+హెచ్‌డీ)ను పొందింది. బిగ్‌బాస్‌లాంటి భారీ వేదికను వినియోగించుకుని స్టార్‌ మా ఇప్పుడు తమ ప్రైమ్‌ టైమ్‌ను ప్రతి సంవత్సరం స్ధిరీకరించుకోవడంతో పాటుగా కొన్ని నూతన బ్లాక్‌బస్టర్‌ షోలనూ ఆవిష్కరించింది. స్టార్‌ మా ఇప్పుడు తమ బిగ్‌బాస్‌ షో సమయాన్ని రాత్రి 10 గంటలకు మార్చింది. అదే సమయంలో తమ అతిపెద్ద ఫిక్షన్‌ సీరియల్‌ ‘వదినమ్మ’ను రాత్రి 9.30గంటలకు తీసుకువచ్చింది. దీనితో స్టార్‌ మా ప్రైమ్‌ టైమ్‌ రాత్రి 11 గంటల వరకూ విస్తరించడంతో పాటుగా వీక్షకులకు ప్రతి రోజూ అదనంగా అర్థగంట వినోదం అందుబాటులోకి వస్తుంది.

చదవండి: హారిక‌కు సోహైల్ వార్నింగ్‌: క‌థే వేరే ఉందిగా!

చదవండి: అరియానాకు చుక్క‌లు చూపిస్తున్న సోహైల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement