వేసవిలో కస్టడీ | Naga Chaitanya Custody Movie First Look Poster Release | Sakshi
Sakshi News home page

వేసవిలో కస్టడీ

Dec 29 2022 5:31 AM | Updated on Dec 29 2022 5:31 AM

Naga Chaitanya Custody Movie First Look Poster Release - Sakshi

నాగచైతన్య, కృతీ శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘కస్టడీ’. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. పవన్‌ కుమార్‌ సమర్పణలో తెలుగు–తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. 2023 మే 12న ‘కస్టడీ’ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

‘‘నాగచైతన్య పుట్టినరోజు (నవంబర్‌ 23) సందర్భంగా విడుదల చేసిన మా సినిమా టైటిల్‌ పోస్టర్, ఫస్ట్‌ లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని మే 12న తెలుగు, తమిళ భాషల్లో సినిమాని విడుదల చేయనున్నాం. ఈ చిత్రంలో అరవింద్‌ స్వామి విలన్‌ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, యువన్‌ శంకర్‌ రాజా, కెమెరా: ఎస్‌ఆర్‌ కదిర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement