'వేదాళం' రీమేక్: చిరంజీవి రూ.60 కోట్లు?

Megastar Chiranjeevi Huge Remuneration For Vedalam Remake - Sakshi

టాలీవుడ్‌లో తిరుగు లేని హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయ‌న సినిమా అంటే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. పండ‌గ పూట బాస్ సినిమా రిలీజైతే వార్ వ‌న్‌సైడ్ అయిపోతుంది. అంత‌టి క్రేజ్ ఉన్న చిరంజీవి ఖైదీ నం.150తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక నుంచి ఏడాదికి ఒక సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తాన‌ని అభిమానుల‌కు మాటిచ్చారు. కానీ అలా జ‌ర‌గ‌లేదు. ఖైదీ నం.150 విడుద‌లైన రెండేళ్ల‌కు సైరా వ‌చ్చింది. బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న ఈ చిత్రానికి చిరు రూ. 40 కోట్లు అందుకున్నార‌ట‌. త‌ర్వాత‌ కొర‌టాల శివ‌తో చేస్తున్న‌ ఆచార్య సినిమాకు రూ.50 కోట్లు తీసుకుంటున్నార‌ట‌. ఇందులో కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టించ‌నుండ‌గా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.  (చ‌ద‌వండి: రౌడీ బేబి @ వందకోట్లు)

తండ్రి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ‌ సినిమాను నిరంజ‌న్ రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో ఉండ‌గానే చిరు మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. త‌మిళ స్టార్ అజిత్ చిత్రం 'వేదాళం' రీమేక్‌లో న‌టించేందుకు ఓకే చెప్పారు. బిల్లా, శ‌క్తి వంటి సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన మెహ‌ర్ ర‌మేశ్ ఈ రీమేక్ బాధ్య‌త‌లు తీసుకున్నారు. తెలుగువారికి క‌నెక్ట్ అయ్యేలా మార్పుచేర్పులు కూడా చేశారు. అయితే ఇందులో న‌టించేందుకు మెగాస్టార్ క‌ళ్లు చెదిరే పారితోషికాన్ని అందుకోనున్న‌ట్లు వినికిడి. ఏకంగా త‌న రెమ్యూన‌రేష‌న్‌ను రూ.60 కోట్ల‌కు ఫిక్స్ చేశారు. బాస్‌ సినిమా అంటే కాసుల వ‌ర్షం కురవ‌డం ఖాయ‌మ‌న్న దీమాతో నిర్మాత అనిల్ సుంక‌ర కూడా ఈ మెగా పేమెంట్‌కు ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌లేద‌ట‌. (చ‌ద‌వండి: చిరంజీవికి కరోనా రాలేదు)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top