ఓటీటీలో క్రిష్ ప్రాజెక్ట్‌.. 'అరేబియా కడలి' రిలీజ్‌పై ప్రకటన | Krish Web Series Arabia Kadali OTT Streaming Date Out | Sakshi
Sakshi News home page

ఓటీటీలో క్రిష్ ప్రాజెక్ట్‌.. 'అరేబియా కడలి' రిలీజ్‌పై ప్రకటన

Jul 28 2025 12:31 PM | Updated on Jul 28 2025 12:31 PM

Krish Web Series Arabia Kadali OTT Streaming Date Out

'అరేబియా కడలి' వెబ్సిరీస్విడుదలపై ప్రకటన వచ్చేసింది. అమెజాన్ఒరిజినల్సిరీస్లో భాగంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు కొద్దిరోజుల క్రితం సంస్థ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇందులో సత్యదేవ్, ఆనంది జంటగా నటించారు. ఈ సిరీస్లో రెండు గ్రామాల మత్స్యకారులు ఇతర దేశాల జలాల్లోకి పొరపాటున వెళ్లి, అక్కడ బంధీ అవ్వడం ఆపై వారు ఎలా తిరిగొచ్చారనేది కథాంశం. ఈ వెబ్ సిరీస్కు క్రిష్ జాగర్లమూడి రచయితగా, క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. సూర్య కుమార్ దర్శకత్వం వహించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వై. రాజీవ్ రెడ్డి, జె. సాయిబాబు నిర్మించారు.

'అరేబియా కడలి' వెబ్సిరీస్ఆగష్టు 8 విడుదల కానున్నట్లు తాజాగా ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, హిందీ, మలయాళంలో విడుదల కానుంది. అయితే, చిత్రం తండేల్కాన్సెప్ట్లా ఉండబోతుందని తెలుస్తోంది. ఇదే స్టోరీ లైన్తో సినిమా తెరకెక్కించారని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement