'40 రోజులు వనవాసం'.. స్టార్ హీరోయిన్ ఆసక్తికర పోస్ట్! | Keerthy Suresh Post After Completion Of Her latest Web Series | Sakshi
Sakshi News home page

Keerthy Suresh: 'వనవాసం పూర్తి చేసుకుని తిరిగి వచ్చా'

Apr 9 2024 2:55 PM | Updated on Apr 9 2024 4:34 PM

Keerthy Suresh Post After Completion Of Her latest Web Series - Sakshi

దక్షిణాదిలో స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్‌ ఒకరు. గతేడాది దసరా మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. కెరీర్‌ ప్రారంభంలోనే జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న కీర్తి తన శక్తికి మించిన పాత్రల్లోనూ నటించి మెప్పించింది. మహానటిగా అభిమానుల గుండెల్లో తన పేరును లిఖించుకుంది. తెలుగు, తమిళ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ తాజాగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు.

అంతే కాకుండా ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టారు. తాజాగా అక్కా అనే వెబ్‌ సిరీస్‌లో నటి రాధిక ఆప్టేతో కలిసి నటించారు. ధనరాజ్‌ శెట్టి దర్శకత్వం వహించిన ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ కోసం కేరళలో మకాం పెట్టిన కీర్తి సురేష్‌ తాజాగా తన ఇన్‌స్ట్రాగామ్‌లో పంచుకున్నారు.

దాదాపు 40 రోజులు వనవాసం పూర్తి చేసి ఇప్పుడే సోషల్ మీడియాలోకి తిరిగివచ్చానని రాసుకొచ్చారు. అక్కా వెబ్‌ సిరీస్‌లో నటించడం చాలా సంతోషంగా ఉన్నారు. ఈ షెడ్యూల్‌ని ముగించుకుని ఇంటికి తిరిగిరావడం సరి కొత్త అనుభూతిగా ఉందని పేర్కొన్నారు. ఇకపై ఇతర మూవీ షూటింగ్‌లకు హాజరవుతానని తెలిపారు. కాగా.. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తమిళంలో రఘు తాత, రివాల్వర్‌ రీటా, కన్నివెడీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ మూడు ఉమెన్‌ సెంట్రిక్‌ కథా చిత్రాలు కావడం విశేషం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement