స్టార్‌ హీరోయిన్ యాక్షన్‌ థ్రిల్లర్ మూవీ.. ఓటీటీలో కాదట! | Sakshi
Sakshi News home page

Keerthy Suresh: పోలీసుగా దసరా బ్యూటీ.. థియేటర్లకే వస్తున్నామంటూ ట్వీట్!

Published Tue, Jan 23 2024 3:56 PM

Keerthy Suresh latest Movie Release date Announced  - Sakshi

దసరా బ్యూటీ కీర్తి సురేశ్, జయం రవి ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం 'సైరెన్'. 108 అనేది ఉపశీర్షిక. యాక్షన్‌ ప్యాక్డ్‌ ఎమోషనల్‌ డ్రామాగా ఈ సినిమాను ఆంటోని భాగ్యరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్‌ తేదీని కీర్తి సురేశ్‌ తన ట్విటర్‌లో పోస్ట్ చేసింది. అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేసి క్రిమినల్‌గా మారిన ఓ వ్యక్తి కథనే సినిమాగా రూపొందిస్తున్నారు. 14 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి జైలు నుంచి బయటికొచ్చి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనే కథాంశంతో తెరకెక్కుతోంది.

డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్..!

అయితే ఈ సినిమాపై మొదట డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్‌ కానుందని వార్తలొచ్చాయి. ఈ మూవీ రిలీజ్‌ తేదీపై గతంలో చాలాసార్లు రూమర్స్ వినిపించాయి. దీంతో ఈ సినిమాను ఓటీటీలో కాకుండా నేరుగా థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. తమిళ, తెలుగు భాషల్లో థియేటర్లోనే విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్లను జయం రవి, కీర్తి సురేష్‌ ట్విటర్‌లో పంచుకున్నారు. 

(ఇది చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీకి స్టార్ హీరోయిన్ యాక్షన్‌ థ్రిల్లర్..!)

కాగా.. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నారు. డీజే టిల్లు స్క్వేర్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు. మరోవైపు కీర్తి సురేశ్ రఘుతాత అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. 

Advertisement
 
Advertisement