ఆకాశ్‌ వాణి వెబ్‌సిరీస్‌ ప్రారంభం

Kavin And Reba John Act In Akash Vaani Web Series - Sakshi

తమిళ సినిమా: రొమాంటిక్‌ లవ్‌ కామెడీ ఇతివృత్తంతో రూపొందుతున్న వెబ్‌ సిరీస్‌ ఆకాశ్‌ వాణి. నటుడు కెవిన్, రెబాజాన్‌ జంటగా నటిస్తున్నారు. అట్లీ వద్ద శిష్యుడిగా పనిచేసిన ఎనోక్‌ ఏబుల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కస్తూబా మీడియా వర్క్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌లో శరత్‌ రవి, దీపక్‌ పరమేష్, విన్సా, అభితా వెంకట్‌ రామన్, కవితాలయ కృష్ణన్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మెర్సల్, తేరి, బిగిల్‌  చిత్రాల కథా రచయిత రమణన్‌ గిరివాసన్‌ కథ అందిస్తున్నారు. దీనికి గుణ బాలసుబ్రమణియమ్‌ సంగీతాన్ని, శాంతికుమార్‌ చక్రవర్తి ఛాయాగ్రహణను అందిస్తున్నారు. సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top