Bhool Bhulaiyaa 2 Trailer: ఆసక్తి రేపుతున్న‘భూల్ భులయ్యా -2’ ట్రైలర్‌

Kartik Aaryan Kiara Advani Bhool Bhulaiyaa 2 Trailer Released - Sakshi

కార్తీక్‌ఆర్యన్‌, కియారా అద్వానీ నటిస్తున్న సినిమా ‘భూల్ భులయ్యా-2’. ప్రియదర్శన్ దర్శకత్వంలో 2007లో వచ్చిన సూపర్‌ హిట్‌ ‘భూల్ భులయ్యా’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోందీ చిత్రం. అక్షయ్‌కుమార్‌ హీరోగా నటించిన ఈ చిత్రం ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళం, తెలుగులోనూ చంద్రముఖి పేరుతో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. భూల్ భూలైయా చిత్రం వ‌చ్చి దాదాపు 15 ఏళ్ళు  అయ్యింది.

మళ్లీ ఇన్నాళ్లకు ఈ చిత్రం సీక్వెల్‌ రాబోతుంది. తాజాగా మేక‌ర్స్ ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.‘ప‌దిహేను సంవ‌త్స‌రాల త‌ర్వాత మ‌ళ్ళీ ఎవ‌రో ఆ తలుపును త‌ట్టారు. అందులో ఉన్న‌ది సామాన్య‌మైన ఆత్మ కాదు. అందులో ఉంది మంజులిక‌’ అంటూ ట‌బు చెప్తుండ‌టంతో ట్రైల‌ర్ ప్రారంభ‌మవుతుంది.  రాజ్‌పాల్ యాద‌వ్, ప‌రేశ్ రావ‌ల్ కీల‌క‌పాత్ర‌ల్లో నటించిన ఈ సినిమా మే 20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top