ఘనంగా కపట నాటక సూత్రధారి ప్రీ రిలీజ్ ఈవెంట్.. రిలీజ్‌ ఎప్పుడంటే..?

Kapata Nataka Sutradhari Pre Release Event In Hyderabad - Sakshi

విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాష్, అరవింద్, మేక రామకృష్ణ, విజయ్ తదితరులు ప్రధాన తారాగణంగా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం ‘కపట నాటక సూత్రధారి’. క్రాంతి సైనా దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మనీష్ (హలీమ్) నిర్మాతగా వ్యవహరించారు. సుభాష్ దొంతి సినిమాటోగ్రఫీ అందించారు. రామ్ తవ్వ సంగీతం, రామకృష్ణ మాటలు అందించారు. ఈ సినిమా నవంబర్ 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, నటుడు శివారెడ్డి , నాంది మూవీ డైరెక్టర్ విజయ్ కనకమేడల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ  సందర్భంగా హీరో విజయ్ శంకర్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకి నన్ను హీరోగా ఎంపిక చేసినందుకు దర్శకుడికి, నిర్మాతకి కృతజ్ఞతలు. కపట నాటక సూత్రధారి గురించి చెప్పాలంటే ఇది చాలా మంచి కథ. తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది. దర్శకుడు ఎంతో కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించాడు. నిర్మాతలు ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకాడలేదు. నవంబర్ 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది నమ్ముతున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. 

ఆయన్ను, ఆయన కథను నమ్మి ఈ సినిమాను ఇంత వరకు తీసుకొచ్చిన నిర్మాతకు కృతజ్ఞతలు తెలిపారు డైరెక్టర్‌ క్రాంతి. కథ మీద నమ్మకం తోనే ఈ చిత్రానికి ఎంత ఖర్చు పెట్టారని పేర్కొన్నారు. నిజంగా అంత మంచి ప్రొడ్యూసర్ దొరకడం ఆయన అదృష్టమన్నారు. నిర్మాత మనీష్ మాట్లాడుతూ.. ఈ సినిమాను ఆశీర్వదించటానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. కథ వినగానే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయాలనిపించింది. దర్శకుడు కథ చెప్పిన విధానం, తెరకెక్కించిన విధానం ఎంతో ఆకట్టుకుంది. హీరో విజయ్ శంకర్ ఈ సినిమాతో బాగానే ఆకట్టుకుంటాడు. అన్ని విభాగాల టెక్నిషియన్స్ చాలా బాగా పని చేశారు. టైటిల్‌ చాలా బాగుందని, ఇన్ని రోజులు ఇంత మంచి టైటిల్‌ను ఎలా వదిలేశారనిపించిందని శివారెడ్డి అభిప్రాయపడ్డారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top