టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ తాను నెక్ట్స్ ప్రాజెక్ట్ చేస్తున్నారన్న వార్తలపై స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం నేను ఏ సినిమాను నిర్మించడం లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తనపై అలాంటి వార్తలు రాసి ఇబ్బంది పెట్టవద్దని ట్విటర్ వేదికగా కోరారు.
బండ్ల గణేశ్ తన ట్వీట్‌లో ప్రస్తావిస్తూ..' మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక విన్నపం. ప్రస్తుతం నేను ఏ సినిమాను నిర్మించడం లేదు. అలాగే ఎవరితోనూ సినిమా చేయాలనే నిర్ణయం కూడా తీసుకోలేదు. దయచేసి ఇలాంటి వార్తలు రాయడం ద్వారా నన్ను ఇబ్బంది పెట్టకండి.
మీ అందరి ప్రేమ, మద్దతు ఎప్పుడూ నాతోనే ఉండాలి. చేతులెత్తి నమస్కరిస్తూ ఇంతటితో విన్నవించుకుంటున్నా. ఇట్లు మీ బండ్ల గణేశ్' అంటూ పోస్ట్ చేశారు.
కాగా.. గతనెలలో తెలుసు కదా మూవీ ఈవెంట్‌లో బండ్ల గణేశ్ ఆసక్తిక కామెంట్స్ చేశారు. నేను టెంపర్ సినిమాతో బ్రేక్ తీసుకున్నా.. ఫ్లాప్ మూవీతో కాదు, బ్లాక్‌బస్టర్ సినిమా ఇచ్చి బ్రేక్ తీసుకున్నా.. ఇప్పుడు మొదలవుతుంది సెకండాఫ్ అంటూ మాట్లాడారు. ఇప్పుడే అసలు సినిమా మొదలు కాబోతుంది అంటూ సెకండ్ ఇన్నింగ్స్ ఉండబోతుందని కామెంట్స్ చేశారు. దీంతో మెగాస్టార్‌తో ఓ సినిమా చేయనున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపించింది. ఈ వార్తల నేపథ్యంలోనే తాజాగా నిర్మాత క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక విన్నపం:
ప్రస్తుతం నేను ఏ సినిమాను నిర్మించడం లేదు, అలాగే ఎవరితోనూ సినిమా చేయాలనే నిర్ణయం కూడా తీసుకోలేదు.
దయచేసి కానీ వార్తలు రాయడం ద్వారా నన్ను ఇబ్బంది పెట్టకండి.
మీ అందరి ప్రేమ, మద్దతు ఎప్పుడూ నాతో వుండాలి
చేతులెత్తి నమస్కరిస్తూ…— BANDLA GANESH. (@ganeshbandla) November 4, 2025


