Kangana Ranaut: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో కంగనా రనౌత్, ఫోటోలు వైరల్

పర్యావరణం పచ్చగా ఉండాలనే దృఢ సంకల్పంతో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’కి విశేష స్పందన లభిస్తోంది. స్టార్ నటుల నుంచి సామాన్యుల వరకు ఈ మహోత్తర కార్యక్రమంలో భాగస్వామ్యులవుతున్నారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు.
హైదరాబాద్‌కు వచ్చిన ఆమె శంషాబాద్ పంచవటి పార్క్‌లో మొక్కలు నాటారు. అనంతరం కంగనా మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా కోట్లాది మొక్కలు నాటడం గొప్ప విషయమని ఆమె అన్నారు. ఈ ఛాలెంజ్‌ను అందరూ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు. అనంతరం రంగోలి చందర్, రీతూ రనౌత్, అంజలి చౌహన్ లకు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని విసిరారు.
మరిన్ని వార్తలు :
సంబంధిత వార్తలు