'కల్కి' కొత్త రిలీజ్‌ డేట్‌..? ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు శుభవార్త | Kalki 2898 AD Movie New Release Date Locked | Sakshi
Sakshi News home page

'కల్కి' కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదేనా..? ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు శుభవార్త

Apr 6 2024 10:53 AM | Updated on Apr 6 2024 12:49 PM

Kalki 2898 AD Movie New Release Date Locked - Sakshi

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర లీడ్‌ రోల్స్‌ చేస్తున్నారు. భైరవ పాత్రలో ప్రభాస్ కనిపిస్తున్నారని చిత్రి యూనిట్‌ ఇప్పటికే ప్రకటించేసింది. కానీ పద్మావతి పాత్రలో దీపికా పదుకోన్, అశ్వత్థామ పాత్రలో అమితాబ్‌ కనిపిస్తారనే టాక్‌ వినిపిస్తోంది. సి. అశ్వనీదత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదల కావాల్సింది. ఆ సమయంలో ఎన్నికల కారణంగా ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

భారీ బడ్జెట్‌తో కల్కి తెరకెక్కుతున్న సినిమా కావడం.. ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఎన్నికలు ఉండటంతో దాదాపు ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని వాయిదా వేస్తారని సమాచారం. కల్కి వాయిదా పడుతుందని భారీగానే వార్తలు వచ్చాయి. కానీ చిత్ర యూనిట్‌ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కూడా కొంతమేరకు నిరాశచెందుతున్నారు. ఇంతలో వారికి ఒక శుభవార్త నెట్టింట వైరల్‌ అవుతుంది.

మే 9న విడుదల కావాల్సిన కల్కి.. మే 30న విడుదల కానున్నట్లు నెట్టింట ఓ వార్త ట్రెండ్‌ అవుతుంది. ఈమేరకు చిత్ర యూనిట్‌ కూడా త్వరలో అధికారకంగా ప్రకటన కూడా చేయనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో లీడ్‌ రోల్స్‌లో కనిపించే ప్రభాస్, దీపికా పదుకోన్, అమితాబ్‌ బచ్చన్‌ల పాత్రలకు సంబంధించిన పూర్వాపరాలను, ఆ పాత్రల తీరు తెన్నులను చెబుతూ ఓ యానిమేటేడ్‌ వీడియోను రెడీ చేస్తున్నారట. అది డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేయున్నారట. అదే సమయంలో కల్కి విడుదల తేదీని కూడా ఫైనల్‌ చేస్తారట. ఈ విషయంపై త్వరలో అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement