Jr Ntr : ఎన్టీఆర్‌ బావమరిది కోసం రంగంలోకి దిగిన ప్రముఖ నిర్మాత

Jr Ntr Brother In Law Narni Nithin Movie With Sitara Entertainments - Sakshi

నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే చాలామంది హీరోలు వచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది జూ.ఎన్టీఆర్‌ భార్య లక్ష్మీ ప్రణతి తమ్ముడు నితిన్‌ నార్నే కూడా హీరోగా లాంచ్‌ అయ్యాడు. ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగ్నేష దర్శకత్వంలో  ‘శ్రీశ్రీశ్రీ రాజా వారు’అనే టైటిల్‌ను కూడా అనౌన్స్‌ చేశారు. ఫస్ట్‌లుక్‌ కూడా విడుదల చేశారు. ఆ తర్వాత ఏమైందో కానీ ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్‌ లేదు.

కొన్ని కారణాల వల్ల షూటింగ్‌ ఆగిపోయింది. అయితే తాజాగా ఈ సినిమా కోసం ప్రముఖ ప్రొడక్షన్‌ హౌస్‌ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. కొఆగిపోయిన ఈ సినిమాను నిర్మాత నాగవంశీ భుజాన వేసుకొని మళ్లీ పట్టాలెక్కిస్తున్నాడట.

ఎన్టీఆర్‌కు నాగవంశీ వీరాభిమాని అని పలు సందర్భాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ అభిమానంతో, కథ కూడా నచ్చడంతో కొన్ని మార్పులు చేసి ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారట. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top