విజయ్‌ సేతుపతి కాల్షీట్ల కోసం హీరో వెయిటింగ్‌.. | Jayam Ravi, Vijay Sethupathi Speech In Iraivan Pre-Release Event - Sakshi
Sakshi News home page

Iraivan Movie: విజయ్‌ సేతుపతి కాల్షీట్ల కోసం హీరో వెయిటింగ్‌..

Sep 26 2023 11:44 AM | Updated on Sep 26 2023 1:37 PM

Jayam Ravi, Vijay Sethupathi Speech in Iraivan Pre Release Event - Sakshi

తాను దర్శకుడిని అడగ్గా ఇరైవన్‌ అంటే ప్రేమ అని చెప్పారన్నారు. ఇది ప్రేమతో ప్రారంభమైన చిత్రం అన్నారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నటుడు విజయ్‌ సేతుపతి

జయం రవి, నయనతార జంటగా నటించిన చిత్రం ఇరైవన్‌. నటి విజయలక్ష్మి, నరేన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ప్యాషన్‌ స్టూడియోస్‌ పతాకంపై సుదన్‌ సుందరం నిర్మించిన ఈ చిత్రానికి అహ్మద్‌ దర్శకత్వం వహించారు. యువన్‌ శంకర్‌రాజా సంగీతాన్ని అందించిన ఇరైవన్‌ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 28న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ప్రీ రిలీజ్‌ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం చైన్నెలోని ఒక హోటల్‌లో నిర్వహించారు.

ఇందులో పాల్గొన్న నటుడు జయం రవి మాట్లాడుతూ.. ఇరైవన్‌ చిత్ర టైటిల్‌ గురించి చాలా మంది అడిగారన్నారు. ఇదే విషయం గురించి తాను దర్శకుడిని అడగ్గా ఇరైవన్‌ అంటే ప్రేమ అని చెప్పారన్నారు. ఇది ప్రేమతో ప్రారంభమైన చిత్రం అన్నారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నటుడు విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ.. తాను చూసిన తొలి హీరో జయం రవి అన్నారు.

అయితే తాను దర్శకత్వం వహించాలని కోరుకుంటున్న తొలి కథానాయకుడు విజయ్‌ సేతుపతి అని.. ఆయన త్వరగా కాల్షీట్స్‌ ఇవ్వాలని జయంరవి కోరారు. ఇక దర్శకుడు అహ్మద్‌ ప్రేమాభిమానాలు తనకు ఎప్పుడూ ఉండాలన్నారు. ఈ చిత్రం నిర్మాతకు మంచి లాభాలు తెచ్చిపెడుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాత సుదన్‌ సుందర మాట్లాడుతూ జయం రవి, విజయ్‌ సేతుపతి ఇద్దరూ పాత్రలకు ప్రాణం పోయడానికి శ్రమించే నటులని పేర్కొన్నారు.

చదవండి: శివాజీ నోటిదూల.. 'ఎక్స్‌' టాపిక్‌.. నీ క్యారెక్టర్‌ ఏంటంటూ శుభశ్రీపై ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement