నయనతారకు 2026 కలిసొచ్చినట్లేనా? | - | Sakshi
Sakshi News home page

నయనతారకు 2026 కలిసొచ్చినట్లేనా?

Feb 4 2026 7:19 AM | Updated on Feb 4 2026 7:19 AM

నయనతా

నయనతారకు 2026 కలిసొచ్చినట్లేనా?

తమిళసినిమా: దక్షిణాదిలోనే లేడీ సూపర్‌ స్టార్‌గా కొనసాగుతున్న నటి నయనతార. కథానాయకి, నిర్మాత, వ్యాపారవేత్త ఇలా పలు రంగాల్లో రాణిస్తున్న నయనతార నాలుగు పదులు దాటిన వయసులోనూ బిజీగా ఉన్నారు. అయితే నటిగా మాత్రం గత కొద్ది కాలంగా ఈమె చాలా అన్‌ హ్యాపీగా ఉన్నారనే చెప్పాలి. తమిళం, తెలుగు, మలయాళం తదితర భాషల్లో నటిస్తున్నా, ఈమె మంచి విజయాన్ని చూసి చాలా కాలమే అయ్యింది. ఆ మధ్య నయనతార నటించిన లేడీ ఓరియోంటెడ్‌ కథా చిత్రాలు పూర్తిగా నిరాశ పరిచాయి. కాగా తాజాగా ఈ సంచలనటి కెరీర్‌ 2026 లో సక్సెస్‌ తోనే ప్రారంభమైంది. తెలుగులో చిరంజీవికి జంటగా నటించిన మన శంకర వరప్రసాద్‌ గారు చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. కాగా ప్రస్తుతం ఈమె చేతిలో మూక్కుత్తి అమ్మన్‌ –2, చాలా కాలం క్రితం ప్రారంభమైన మన్నాంగట్టి, అదేవిధంగా రాక్కాయి చిత్రాలు, కన్నడంలో నటుడు యశ్‌ తో కలిసి నటిస్తున్న టాక్సిక్‌ చిత్రం ఉన్నాయి. వీటిలో సుందర్‌.సి దర్శకత్వం వహిస్తున్న మూక్కుత్తి అమ్మన్‌ –2 చిత్రం షూటింగ్‌ ను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం సమ్మర్‌ స్పెషల్‌గా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇంతకుముందు నయనతార నటించిన మూక్కుత్తి అమ్మన్‌ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో దానికి సీక్వెల్‌ గా రూపొందుతున్న మూక్కుత్తి అమ్మన్‌ –2 చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అదేవిధంగా నటుడు యశ్‌తో కలిసి నటించిన టాక్సిక్‌ చిత్రం కూడా మార్చి 19వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఆ తర్వాత మన్నాంగట్టి, రాక్కాయి చిత్రాలు వరుసగా విడుదల అయ్యే అవకాశం ఉంది. వీటిలో ఏ ఒక్క చిత్రం సక్సెస్‌ అయిన నయనతార కెరియర్‌కు పెద్ద హెల్ప్‌ అవుతుంది అని చెప్పవచ్చు.

నటి నయనతార

నయనతారకు 2026 కలిసొచ్చినట్లేనా?1
1/1

నయనతారకు 2026 కలిసొచ్చినట్లేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement