పుదుచ్చేరిలో సీట్ల పందేరం | - | Sakshi
Sakshi News home page

పుదుచ్చేరిలో సీట్ల పందేరం

Feb 4 2026 7:19 AM | Updated on Feb 4 2026 7:19 AM

పుదుచ్చేరిలో సీట్ల పందేరం

పుదుచ్చేరిలో సీట్ల పందేరం

సాక్షి, చైన్నె: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో డీఎంకే, కాంగ్రెస్‌ కూటమిలో సీట్ల పంపకాల చర్చలు మొదలయ్యాయి. మంగళవారం లాజ్‌ పేటలో డీఎంకే ఎంపీ జగద్రక్షకన్‌ నేతృత్వంలో కూటమి పార్టీల నేతలు సమావేశమయ్యారు. పుదుచ్చేరిలో కాంగ్రెస్‌, డీఎంకే, సీపీఎం, సీపీఐ, వీసీకే తదితర పార్టీలన్నీ కూటమిగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాయి. ఇక, బీజేపీ, ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌, అన్నాడీఎంకే, పీఎంకే తదితర పార్టీలన్నీ మరో కూటమిగా ఎన్నికలకు రెడీ అయ్యాయి. తమిళనాడులో ఉన్నట్టుగానే పార్టీలో పొరుగున ఉన్న పుదుచ్చేరిలో ఉన్నప్పటికీ, అక్కడి నిర్వాహకులకు పార్టీ అధినేతలు సర్వాధికారాలు అప్పగించడం జరుగుతుంది. ఇక్కడ డీఎంకేకు ప్రత్యేక పర్యవేక్షకుడిగా ఎంపీ జగత్‌ రక్షకన్‌ ఉన్నారు. ఈ పరిస్థితులో కూటమి పరంగా పార్టీలు సీట్ల పంపకాల కసరత్తులలో పడ్డాయి. 30 నియోజకవర్గాలతో కూడిన ఇక్కడ డీఎంకే, కాంగ్రెస్‌, ఇతర మిత్ర పక్షాలకు కేటాయించాల్సిన సీట్లను గురించి, ఆయా పార్టీల రాష్ట్ర కార్యదర్శులు విజ్ఞప్తులను జగత్‌ రక్షకన్‌ పరిశీలించారు. ఈ సమావేశంలో డీఎంకే నేతలు ఎమ్మెల్యేలు శివకుమార్‌, సెంథిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయా పార్టీలు ఉంచిన డిమాండ్లను పార్టీ అధ్యక్షుడు , తమిళనాడు సీఎం స్టాలిన్‌తో చర్చించి తదుపరి నిర్ణయాన్ని జగత్‌రక్షకన్‌ తీసుకోనున్నారు. కాగా పుదుచ్చేరిలో ప్రస్తుతం ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌– బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. మళ్లీ అధికారం దిశగా వ్యూహాలకు ఈ కూటమి పదును పెట్టింది. అదే సమయంలో విజయ్‌ నేతృత్వంలోని టీవీకే రానున్న ఎన్నికలలో పుదుచ్చేరిలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

పుదుచ్చేరి ప్రవేశమార్గం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement